BigTV English

PM MODI : ఇండియా కూటమి ఫ్యూజ్ పోయింది.. బీఆర్ఎస్ అడ్రస్ కనిపించడం కూడా కష్టమే : ప్రధాని మోదీ

PM MODI : ఇండియా కూటమి ఫ్యూజ్ పోయింది.. బీఆర్ఎస్ అడ్రస్ కనిపించడం కూడా కష్టమే : ప్రధాని మోదీ

PM Modi Speech in Vemulawada : ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో పర్యటిస్తున్నారు. తొలుత దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజన్న సన్నిథికి విచ్చేసి.. కోడె మొక్కులు చెల్లించుకుని రాజన్నను దర్శించుకున్నారు. పండితుల ఆశీర్వచనం తీసుకుని నేరుగా సభా ప్రాంగణానికి వెళ్లారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అని తెలుగులో ప్రసంగించారు. కరీంనగర్ లో బీజేపీ అభ్యర్థి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ కాంగ్రెస్ చాలా కష్టంమీద అభ్యర్థిని నిలబెడితే.. బీఆర్ఎస్ అడ్రస్ మచ్చుకైనా కూడా కనిపించడం లేదన్నారు.


మూడో దశ ఎన్నికలు నిన్నే ముగియగా.. అక్కడ కూడా కూటమి ఫ్యూజ్ పోయిందని యద్దేవా చేశారు. బీజేపీ మెజార్టీ సీట్లలో విజయం సాధించడం ఖాయమని చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు నాణేనికి బొమ్మ, బొరుసు లాంటివని.. ఆ రెండింటి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే.. కేంద్రంలో బీజేపీనే రావాలన్నారు. ఆ రెండు పార్టీలు కుటుంబ రాజకీయాలు చేస్తాయని విమర్శించారు. కాంగ్రెస్ అన్ని రంగాలను దెబ్బతీసి నాశనం చేస్తే.. ఎన్టీయే సర్కార్.. మీ ఒక్క ఓటుతోనే.. ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ను తీర్చిదిద్దిందని, ఆర్టికల్ 370ని రద్దు చేసిందని తెలిపారు.

Also Read : రిజ‌ర్వేష‌న్ల‌పై కాంగ్రెస్ కుట్ర..నకిలీ వీడియోల తయారీలో బిజీ : పీఎం మోదీ


పీవీ నరసింహారావు వంటి వారిని కాంగ్రెస్ అవమానిస్తే.. బీజేపీ ప్రభుత్వం ఆయనకు భారతరత్న ఇచ్చి గౌరవించిందని మోదీ తెలిపారు. నిన్ననే ఆయన కుటుంబ సభ్యులందరినీ కలిసినట్లు చెప్పారు. పదేళ్ల కాలంలో తన పనితీరు ఎలా ఉందో చూసి.. ఓటు వేయాలని కోరారు. రైతులకు పెట్టబడి సాయం, కిసాన్ సమ్మానిధి, పసల్ బీమా యోజన వంటి పథకాలతో రైతులను ఆదుకున్నామని తెలిపారు. వ్యవసాయ రంగంలో డ్రోన్ల విధానాన్ని పోత్సహించి.. టెక్స్ టైల్ పార్కులు కూడా ఏర్పాటు చేశామని చెప్పారు.

తెలంగాణలో ప్రస్తుతం డబుల్ ఆర్ ట్యాక్స్ పైనే చర్చ జరుగుతోందని, ఈ ట్యాక్స్ ద్వారా ఇప్పటికే 1000 కోట్ల రూపాయలు దోచేశారని ప్రధాని మోదీ ఆరోపించారు. ఆర్ఆర్ఆర్ సినిమా 1000 కోట్లు సాధిస్తే.. తెలంగాణలో ఒక ఆర్ దోచుకుందని.. ఢిల్లీని మరో ఆర్ దోచుకోవాలని చూస్తుందని మోదీ పేర్కొన్నారు. బీజేపీ తొలి ప్రాధాన్యం దేశానికి ఇస్తే.. కాంగ్రెస్ మాత్రం దోచుకోవడానికి ప్రాధాన్యమిస్తుందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ హైదరాబాద్ ను ఎంఐఎంకు దారాధత్తం చేసిందన్నారు.

Tags

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×