Big Stories

A boat capsized: జీలం నదిలో పడవ బోల్తా.. ఆరుగురు విద్యార్థులు మృతి

A boat capsized: జమ్మూకాశ్మీర్‌లో ఘోరం ప్రమాదం జరిగింది. శ్రీనగర్ సమీపంలోని ఉన్న జీలం నదిలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పలువురు మిస్సయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నదిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

- Advertisement -

Also Read : ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

- Advertisement -

మంగళవారం ఉదయం 10 నుంచి 12 మంది పాఠశాల విద్యార్థులతో కలిసి బోటు బయలుదేరింది. మార్గ మధ్యలోకి వెళ్లేసరికి వాటర్ ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో బోటు తిరగబడిపోయింది. నలుగురు మరణించినట్టు తెలుస్తోంది. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. పలువురు జాడ కనిపించలేదు. వారి కోసం వెతుకులాట మొదలుపెట్టింది ఎస్‌డీ‌ఆర్‌ఎఫ్ టీమ్. అయితే మృతి చెందినవారెవరు? అనేది తెలియాల్సి ఉంది.

కొద్దిరోజులుగా జమ్మూకాశ్మీర్‌లో హిమపాతానికి తోడు భారీవర్షాలు పడుతున్నాయి. వాతావరణ శాఖ స్థానిక ప్రజలను అలర్ట్ చేసింది. ఇళ్లలో నుంచి ఎవరు బయటకురావద్దని హెచ్చరించింది. అయితే వర్షం తగ్గడంతో విద్యార్థులు పాఠశాలకు బయలుదేరారు. ఈ క్రమంలో ఎగువ ప్రాంతాల నుంచి నీటి ప్రవాహం పెరగడంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News