Big Stories

G.D.Nellore Politics: నెల్లూరు బరిలో ఎవరి బలం ఎంత.?

Gangadhara Nellore Assembly constituency(AP Politics): ఏపీ రాజకీయాల్లో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గురించి తెలియని వారు ఉండరు.  తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు కుటుంబంతో పాటు అయన కులం పై వ్యక్తిగత విమర్శలు చేస్తూ వివాదాస్పదనేతగా ఫోకస్ అవుతుంటారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు ఎస్సీ రిజర్వ్‌డ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ మంత్రి తన శాఖల గురించి ఏనాడు మాట్లాడరని ప్రత్యర్ధులను టార్గెట్ చేయడానికే టైం కేటాయిస్తారన్న విమర్శలున్నాయి. ఆ క్రమంలోసొంత నియోజకవర్గం గంగాధర నెల్లూరు వైసీపీలో ఆయనపై తీవ్ర వత్యిరేకిత పెరిగింది. ఈ సారి నారాయణస్వామికి టికెట్ ఇవ్వవద్దని పెద్ద ఎత్తున అందోళనలు జరిగాయి.

- Advertisement -

దాంతో మధ్యే మార్గంగా వైసీపీ అధిష్టానం జీడి నెల్లూరు నుంచి రెండు సార్లు గెలిచిన నారాయణస్వామి స్థానంలో .. ఆయన కూమార్తె కృపాలక్ష్మిని రంగంలోకి దించింది. నారాయణస్వామి వ్యకిగత దాడిలో ఆగ్రహంతో ఉన్న టీడీపీ అధిష్టానం కూడా ఈ సారిబలమైన అభ్యర్థిని రంగంలో దింపింది. స్ధానికంగా మంచి పలుకుబడి ఉన్న డాక్టర్ థామస్‌ను అభ్యర్ధిగా ప్రకటించింది. అయన భార్య రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఎస్సీ , రెడ్డి ఈక్వేషన్లు కలిసి వస్తాయని. దానికి తోడు స్థితిమతుడైన డాక్టర్‌గా థామస్ చేసిన సేవలు, ప్లస్ అవుతాయని టీడీపీ ధీమాతో ఉంది.

- Advertisement -

Also Read: ఫ్యామిలీ వార్.. సై అంటే సై

ఇలాంటి సమయంలో డాక్టర్ థామస్ క్రిస్టియన్ అని ప్రచారం ప్రారంభించారు నారాయణస్వామి వర్గీయులు  ఆయన నామినేషన్ చెల్లు బాటు కాదని ఊదరగొట్టారు. నామినేషన్ పరిశీలన సందర్భంగా పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే థామస్ నామినేషన్ ఓకే అవ్వడంతో మరో మార్గం కోసం అలోచించారు సీనియర్ నాయకుడు డిప్యూటీ సియం నారాయణ స్వామి. అందులో బాగంగా కూటమి ఐక్యతను దెబ్బతీస్తే సరిపోతుందని భావించారు.

ఎన్డీఏ కూటమిలోని జనసేన , బీజేపీ నేతలు టీడీపీఅభ్యర్థి థామస్ కు సహాకరించడం లేదంటు ప్రచారం మొదలు పెట్టారు. తాజాగా నియోజకవర్గంలో మండలాల వారీగా ఎన్డీఏ పార్టీలు సమావేశాలు ఏర్పాటు చేశాయి. ఆ సందర్భంగా కొన్ని చోట్ల గ్రామస్థాయి నాయకులు మధ్య చిన్న వాగ్వాదాలు జరిగాయి. సాధారణంగా ఎక్కడైనా కార్యకర్తల మధ్య చిన్నచిన్న స్పర్థలు ఉంటాయి. అయితే దాన్నిఅడ్డం పెట్టుకుని తనకున్న మీడియా విభాగాల్లో నారాయణ పెద్ద ఎత్తున నెగిటివ్ ప్రచారం చేశారు. టీడీపీ అభ్యర్ధికి జనసేన, బిజెపి సహాకరించమని తీర్మానం చేసినట్లు ఫోకస్ చేశారు.

అయితే మరుసటి రోజు ఉదయం చూస్తే సీన్ రివర్స్ అయ్యింది. ప్రతి మండలంలోనూ పెద్ద ఎత్తున కూటమిలోని మూడు పార్టీల నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఆ క్రమంలో తమ మధ్య విభేదాలు లేవని ఇదంతా నారాయణస్వామి కుట్రని తీవ్ర స్థాయిలో అగ్రహం వ్యక్తం చేసారు. నారాయణ స్వామి భాషలోనే సమాధానం చెప్పారు టీడీపీ అభ్యర్థి థామస్, జనసేన మహిళలు నారాయణ స్వామిపై పరుష పదజాలంతో ధ్వజమెత్తారు. ఇప్పటికే నారాయణస్వామి డస్ట్‌బిన్‌లో ఉన్నారని  ఆయన కుమార్తెను కూడా రాజకీయాల్లో చేస్తామని ప్రకటించారు.

Also Read: చీపురుపల్లిలో సూపర్ ఫైట్.. బొత్స కి కష్టమేనా?

మొత్తం మీదా మిత్ర విభేదం కల్పించ లబ్ధిపోంది గట్టెక్కుతామని బావిస్తున్న నారాయణ స్వామికి పార్టీలోని అసమ్మతి పోరుతో పాటు స్వంత మేనల్లుడు రమేష్‌బాబు కాంగ్రెస్ నుంచి పోటీలో ఉండటం తలనొప్పిగా మారిందంట. గత పదేళ్లుగా నారాయణస్వామి వెంటే ఉంటూ వచ్చిన రమేష్ . తన మేనమామ దళిత నేతలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు.

మరో వైపు దేశంలో అతి పెద్ద స్కామ్ ఏపిలోని లిక్కర్ స్కామ్ అని ఆరోపణలు గుప్పిస్తుంది బీజేపీ.. అధికారంలోకి రాగానే టీడీపీ పట్టించుకోకపోయినా  తాము వదలమంటున్న బిజెపి అగ్ర నేతల హెచ్చరికలు కూడా స్వామిలో భయాందోళనలు కలిగిస్తున్నాయంట.  మొత్తంమ్మీద అటు సొంత పార్టీలో వ్యతిరేకత, ఇటు ఇంటిపోరుతో సతమతమవుతున్న వృద్ధనేత  కూతుర్ని గెలిపించుకోవడానికి పడుతున్న పాట్లు చూస్తూ పోలింగ్ నాటికి ఇంకెన్ని స్కెచ్‌లు గీస్తారో అని నియోజకవర్గ వాసులు చర్చించుకుంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News