Big Stories

PM MODI: ఓబీసీ కోటాను కాంగ్రెస్ నిర్వీర్యం చేస్తోంది: పీఎం మోదీ

Lok sabha Elections 2024: ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా కాంగ్రెస్ ల‌క్ష్యంగా ప్రధాని మోదీ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని బెతుల్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. అందులో భాగంగానే అక్కడ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న మోదీ ప్రసంగించారు. ఓబీసీ రిజ‌ర్వేష‌న్ల అంశంలో కాంగ్రెస్ తీరుపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు.

- Advertisement -

కేంద్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏపీలో మొదట మ‌త ప్రాతిప‌దిక‌న రిజ‌ర్వేష‌న్ ప్ర‌వేశ‌పెట్టారని మోదీ అన్నారు. అప్పుడు కాంగ్రెస్ త‌న ప్ర‌య‌త్నంలో విఫలం అయిందని తెలిపారు. అందుకే మరో సారి అదే వ్యూహాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఆ పార్టీ క‌ర్నాట‌క‌లో ఓబీసీలు పొందే రిజ‌ర్వేష‌న్ కోటాకు తూట్లు పొడిచేందుకు ముస్లింలంద‌రినీ ఓబీసీ కోటాలో చేర్చింద‌ని తెలిపారు.

- Advertisement -

Also Read:దేశాన్ని విభజిస్తామంటూ మోదీ తప్పుడు ఆరోపణ.. రాహుల్ గాంధీ క్లారిటీ

కాంగ్రెస్ చేప‌ట్టిన ఈ చ‌ర్య దేశ‌ వ్యాప్తంగా ఓబీసీ వ‌ర్గాల‌కు హెచ్చ‌రిక అని ప్ర‌ధాని అన్నారు. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీ వార‌స‌త్వ ప‌న్నును తెర‌ పైకి తెస్తోందని విమ‌ర్శించారు. త‌ల్లిదండ్రుల నుంచి వార‌స‌త్వంగా వచ్చే ఆస్తిపై ప‌న్ను విధించాల‌ని ఆ పార్టీ స‌ల‌హాదారు సూచించార‌ని మోదీ తెలిపారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News