Tollywood Movies : తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతి శుక్రవారం కొన్ని సినిమాలు రావడం అనేది కామన్ గా జరుగుతుంది. కొన్నిసార్లు సినిమాలు వస్తే అన్నీ కలిపి ఏకధాటిగా ఒకేసారి వస్తాయి. మరి కొన్నిసార్లు అసలు సినిమాలు రాకుండా పోతాయి. ముఖ్యంగా సంక్రాంతి సీజన్ లో సినిమాలు ఎలా అయితే రిలీజ్ అవుతాయో కొన్ని సందర్భాలలో వేసవి కూడా అలానే సినిమాలు రిలీజ్ అవుతాయి. స్కూల్ పిల్లలకు ఇప్పుడు ఎక్కువగా హాలిడేస్ కాబట్టి ఈ తరుణంలో స్టార్ హీరోలు సినిమాలు ఉంటే బాగుంటుంది అని అందరికీ ఒక అభిప్రాయం ఉంది. కానీ ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలేవి కూడా రిలీజ్ లేకుండా పోయాయి. ఇది తెలుగు ప్రేక్షకులలో కొద్దిపాటి నిరాశ కలిగించే విషయం. ఇకపోతే ఈ వారం బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా 12 సినిమాలు రిలీజింగ్ సిద్ధంగా ఉన్నాయి.
సారంగపాణి జాతకం
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న విలక్షణమైన దర్శకులలో ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఒకరు. గ్రహణం సినిమాతో దర్శకుడుగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన మోహన్ కృష్ణ తన జీవితంలో ఎక్కువ సినిమాలు పుస్తకాలనుండి ప్రారణ పొంది తీశారు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ సినిమాలకు కూడా కొద్దిపాటి అభిమానులు ఉన్నారు అని చెప్పడం అతిశయోక్తి కాదు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించిన సమ్మోహనం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఇక ప్రస్తుతం ప్రియదర్శి ప్రధాన పాత్రలో అందరికంటే మోహన్ కృష్ణ దర్శకత్వం వహించిన సారంగపాణి జాతకం సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది.
చౌర్య పాఠం
దర్శకుడు త్రినాధరావు నక్కిన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా సినిమాలు దర్శకత్వం వహించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నారు. ధమాకా సినిమాతో 100 కోట్ల మార్కెట్లో కూడా చేరిపోయారు. ఆ తర్వాత సందీప్ కిషన్ హీరోగా మజాకా సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది. ఇప్పుడు ఆయన నిర్మాతగా చౌర్య పాఠం సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాకు మంచి ప్రమోషన్స్ చేశారు. ప్రతి ప్రమోషనల్ వీడియో కూడా చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది.
డబ్బింగ్ సినిమాలు
తెలుగు ప్రేక్షకులు ఇతర భాష సినిమాలను కూడా ఎలా ఆదరిస్తారు చాలామంది చాలా సందర్భాల్లో తెలిపారు. మిగతా ఇండస్ట్రీకి సంబంధించిన నటీనటులు కూడా తెలుగు ఫిలిం ఆడియన్స్ ని ఎప్పుడు మెచ్చుకుంటారు. ఏప్రిల్ 25న జింఖానా, తుడరమ్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. వీటితోపాటు సంపూర్ణేష్ బాబు నటించిన సోదరా కూడా రిలీజ్ కానుంది. ఈ చిత్రాలన్నిటితోపాటు శివ శంభో, హలో బేబి, ALCC,సర్వం సిద్ధం ,
సూర్యాపేట్ జంక్షన్ , మన ఇద్దరి ప్రేమకథ, 6 జర్నీ వంటి చిన్న సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ కానున్నాయి.
Also Read : ChiruOdela : చిరంజీవి సినిమాలో నాని, చాలా పగడ్బందీగా ప్లాన్ చేశావ్ శ్రీకాంత్