ChiruOdela : మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనేది చాలామందికి ఉన్న కల. ఎంతోమంది దర్శకులు ఆయనతో సినిమా చేయాలని ప్రయత్నించి విరమించుకున్నారు. ఒక సందర్భంలో రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో కూడా మెగాస్టార్ చిరంజీవి సినిమా చేయాల్సి ఉంది. ఆ సినిమా కూడా మధ్యలో ఆగిపోయింది. రాంగోపాల్ వర్మ శిష్యుడు పూరి జగన్నాథ్ మెగాస్టార్ రీయంట్రీ సినిమాకి దర్శకుడుగా వ్యవహరించాల్సి ఉంది. ఆ సినిమాకి ఆటో జానీ అనే టైటిల్ కూడా ఖరారు అయింది. అయితే చివరి నిమిషంలో ఆ సినిమా కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా డివివి దానయ్య సినిమాను చేయబోతున్నారు అని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి అనౌన్స్ చేసిన ప్రాజెక్టు కూడా పట్టాలెక్కలేదు. ప్రస్తుతం చిరంజీవి వరుసగా యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయడం మొదలుపెట్టారు.
వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి ,వశిష్ట, శ్రీకాంత్ వంటి దర్శకులతో సినిమాను చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే డైరెక్టర్ బాబి దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య అనే సినిమాను చేశారు మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి నుంచి అభిమానులు ఏ అంశాలను కోరుకుంటారు వాటిని అద్భుతంగా సినిమాలో ప్రజలు చేసి సంక్రాంతికి బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది. మెగాస్టార్ అభిమానులు అందరికీ కూడా ఒక విజువల్ ట్రీట్ అనిపించింది. ఇక ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దానితోపాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా మెగాస్టార్ చిరంజీవి సినిమా చేస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది.
మెగాస్టార్ చిరంజీవిలో నాని
రీసెంట్ గా శ్రీకాంత్ ఓదెల మెగాస్టార్ చిరంజీవికి ఒక కథను చెప్పిన విషయం తెలిసిందే. దీని గురించి అధికారక ప్రకటన కూడా వచ్చేసింది. శ్రీకాంత్ మెగాస్టార్ చిరంజీవికి చాలా అద్భుతంగా కథ చెప్పారట. మెగాస్టార్ చిరంజీవి కథను విన్న వెంటనే ఎవరు ప్రొడ్యూసర్ అనుకుంటున్నావు అని అడగ్గాని నాని అన్న అని చెప్పాడట శ్రీకాంత్. నాని అయితే నాకు కూడా ఓకే అని చిరంజీవి మాటిచ్చారు. శ్రీకాంత్ తనతో మాట్లాడిన చాలా సందర్భాల్లో మెగాస్టార్ ని ఎలా చూపిస్తే బాగుంటుంది అని తనకు చెప్పాడని నాని చెబుతూ వచ్చాడు. ఇకపోతే ఈ సినిమా కంప్లీట్ ప్రీ ప్రొడక్షన్ పూర్తయి, స్క్రిప్ట్ ఫైనల్ దశ కి వచ్చేసిన తర్వాత ఈ సినిమాలో నేను నటించాలా లేదా అని డిసైడ్ అవుతుంది అని నాని రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు.
Also Read : Ipl2025 : ఐపీఎల్ లో కూడా పెద్ది సినిమా హవా నడుస్తుంది