BigTV English

2023 Rewind: ఈ ఏడాది బాక్సాఫీసు బద్దలుకొట్టిన కొత్త దర్శకులు వీళ్లే..

2023 Rewind: ఈ ఏడాది బాక్సాఫీసు బద్దలుకొట్టిన కొత్త దర్శకులు వీళ్లే..

2023 Rewind: ఈ ఏడాది బాక్సాఫీసు వద్ద కొత్త దర్శకుల హవా నడిచింది. డిఫరెంట్ స్టోరీలతో చిత్రాలు తెరకెక్కించి అబ్బురపరిచారు. ఎంట్రీ ఇస్తూనే బ్లాక్ బస్టర్ హిట్లను తమ ఖాతాల్లో వేసుకున్నారు. అంతేకాదు ఈ ఏడాది సుమారు అరడజనకు పైగా కొత్త దర్శకులు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. మరి ఆ కొత్త దర్శకులు ఎవరో? ఇప్పుడు చూసేద్దాం..


శ్రీకాంత్ ఓదెల..

నేచురల్ స్టార్ నాని కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వడంలో ముందుంటారు. ఇందులో భాగంగా ఈ ఏడాది ఇద్దరి కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అందులో ఒకరు ‘దసరా’ సినిమా డైరెక్ట్ చేసిన శ్రీకాంత్ ఓదెల. రూ.65 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం రూ.117 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక మరో డైరెక్టర్ శౌరవ్ ‘హాయ్ నాన్’తో ఆడియన్స్‌ని ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ ఎక్కించేశారు. రూ.40 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం రూ.72 కోట్ల వరకు వసూళు చేసింది.


షణ్ముఖ ప్రశాంత్..

యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు సుహాస్ హీరోగా నటించిన చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’. షణ్ముఖ ప్రశాంత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి.. ఎవరూ ఊహించని రెస్పాన్స్‌తో అందరి మనసులు దోచుకుంది. కేవలం నాలుగు కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం రూ.12 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.

జబర్దస్త్ వేణు..

జబర్దస్త్‌లో తన కామెడీతో అందర్నీ కడుపుబ్బా నవ్వించేవాడు వేణు. ఈ కమెడియన్ ‘బలగం’ సినిమా స్క్రిప్ట్‌తో అందర్నీ ఏడిపించేడు. ప్రియదర్శి హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం మూడు కోట్లతో రూపొంది.. రూ.26 కోట్లకు పైగా వసూళ్లు చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. పలు అంతర్జాతీయ అవార్డులను కూడా అందుకుంది.

సుమంత్ ప్రభాస్..

షార్ట్ ఫిలిమ్స్‌తో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు సుమంత్ ప్రభాస్. అయితే తానే నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘మేమ్ ఫేమస్’. మూడు కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. బాక్స్ ఆఫీస్ వద్ద రూ.5 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంది.

సాయి రాజేశ్..

ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కి అదిరే కలెక్షన్లు అందుకున్న చిత్రం ‘బేబి’. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ మూవీకి యూత్ బాగా కనెక్ట్ అవడంతో కలెక్షన్ల వర్షం కురిపించింది.

రామ్ అబ్బరాజు..

రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా నటించిన చిత్రం ‘సామజవరగమన’. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది.

కళ్యాణ్ శంకర్..

చాలా కాలం తరువాత ఒక కాలేజీ బ్యాక్‌డ్రాప్ కథతో వచ్చిన సినిమా ‘మ్యాడ్’. కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం సూపర్ హిట్‌ను సొంతం చేసుకుంది. దాదాపు రూ.5 కోట్లతో తెరకెక్కి రూ.24 కోట్లకు పైగా వసూళ్లు చేసింది.

మురళి కిషోర్ అబ్బుర..

కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కిన ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రం ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రానికి మురళి కిషోర్ అబ్బుర దర్శకత్వం వహించారు. సుమారు ఆరు కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి బాక్స్ ఆఫీస్ వద్ద రూ.11 కోట్ల పైనే కలెక్షన్స్‌ని రాబట్టింది.

క్లాక్స్..

కార్తికేయకు ‘బెదురులంక 2012’ సినిమాతో హిట్టు అందించిన దర్శకుడు క్లాక్స్. దాదాపు రూ.7 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం..రూ.16 కోట్ల వరకు కలెక్షన్స్‌ని రాబట్టింది.

Tags

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×