BigTV English

Vaccine For Lowering ldl : టీకాతో చెడు కొలెస్ట్రాల్‌కు అడ్డుకట్ట!

Vaccine For Lowering ldl : టీకాతో చెడు కొలెస్ట్రాల్‌కు అడ్డుకట్ట!

Vaccine For Lowering ldl : హార్మోన్లు, జీవకణాల నిర్మాణంలో కొలెస్ట్రాల్ దే కీలక‌పాత్ర. మన రక్తంలో అదే కొలెస్ట్రాల్ స్థాయులు పెరిగే మాత్రం కొరివిదెయ్యమే! చెడు కొలెస్ట్రాల్(ఎల్‌‌డీఎల్-లో డెన్సిటీ లిపోప్రొటీన్స్) కారణంగా రక్తనాళాల్లో పూడికలు ఏర్పడతాయి. దాంతో గుండె, మెదడు మరింత ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. అంతిమంగా గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి.


ఆరోగ్యకరమైన జీవనం కోసం ఎప్పటికప్పుడు ఈ కొవ్వును అదుపులో పెట్టుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా 18 మిలియన్ల మంది కార్డియోవాస్య్కులర్ వ్యాధుల బారిన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) చెబుతోంది. గుండెకు కొలెస్ట్రాల్ కలిగించే ముప్పును గణనీయంగా తగ్గించగలిగే టీకా అందుబాటులోకి వచ్చే రోజు ఎంతో దూరంలో లేదు.

యూనివర్సిటీ ఆఫ్ న్యూమెక్సికో స్కూల్ ఆఫ్ మెడిసిన్ రిసెర్చర్లు రూపొందించిన వ్యాక్సిన్‌ను జంతువులపై పరీక్షించి చూశారు. ఎంతో చౌకధరకే లభ్యం కాగల ఆ టీకాతో చెడు కొలెస్ట్రాల్.. ఎల్‌డీఎల్ స్థాయులు సమర్థంగా తగ్గినట్టు తేలింది. రక్తంలో ఎల్‌డీఎల్ స్థాయిని తగ్గించే ఔషధాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. అయితే PCSK9 ఇన్హిబిటర్లుగా పిలిచే ఆ డ్రగ్స్ ఖరీదు చాలా ఎక్కువ. అందుకే చౌకధరకే లభించగల ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించామని పరిశోధనకు నేతృత్వం వహించిన బ్రైస్ చకేరియన్ వెల్లడించారు.


ఇందులో భాగంగా తాము తయారు చేసిన వ్యాక్సిన్‌ను జంతువులపై ప్రయోగించి చూశారు రిసెర్చర్లు. టీకా కారణంగా ఎల్‌డీఎల్ లెవల్స్ 30% మేర తగ్గినట్టు ప్రయోగాల్లో వెల్లడైందని బ్రైస్ చకేరియన్ వివరించారు. దాంతో గుండెజబ్బుల బారిన పడే ప్రమాదం వాటిలో గణనీయంగా తగ్గిందన్నారు. గత పదేళ్లుగా ఆ వ్యాక్సిన్‌ను ఎలుకలు, కోతులపై ప్రయోగించి చూశారు. ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయంటూ పరిశోధకులు సంతృప్తి వ్యక్తం చేశారు. పరిశోధనలో తదుపరి దశగా మానవులపై టీకాను పరీక్షించనున్నారు. అయితే ఇందుకు బోలెడన్ని నిధులు, సమయం పట్టొచ్చు.

Tags

Related News

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

White Foods: ఆరోగ్యాన్ని దెబ్బతీసే.. 3 తెల్లటి ఆహార పదార్థాలు, వీటితో.. ఇంత డేంజరా ?

Dengue Fever: వర్షాకాలంలో జ్వరమా ? డెంగ్యూ కావొచ్చు !

Big Stories

×