E-Paper
Advertisement

2024 Celebrity Marriages: 2024లో పెళ్లికి సిద్ధమైన సెలబ్రెటీలు వీళ్లే..?

2024 Celebrity Marriages: 2024లో పెళ్లికి సిద్ధమైన సెలబ్రెటీలు వీళ్లే..?
Advertisement

2024 Celebrity Marriages: 2023లో చాలామంది సెలబ్రెటీలు తమ బ్యాచిలర్ లైఫ్‌కి ఫుల్‌స్టాప్ పెట్టారు. తమకు నచ్చినవారితో ఏడడుగులు నడిచి వివాహ బంధానికి వెల్‌కమ్ చెప్పారు. అందులో బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా- కియారా అద్వానీ.. రాజకీయ నాయకుడు రాఘవ్ చద్దా – బాలీవుడ్ హీరోయిన్ పరిణితీ చోప్రా.. టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ – అతియా శెట్టి.. మంచు మనోజ్ – భూమా మౌనిక.. శర్వానంద్ – రక్షిత రెడ్డి.. వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి. అలాగే దగ్గుబాటి అభిరామ్ – ప్రత్యూష వంటి వారు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.

అయితే ఈ ఏడాది కూడా మరికొంత మంది సెలబ్రెటీలు పెళ్లికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. అందులో రకుల్ ప్రీత్‌సింగ్, తమన్నా, అదితిరావు హైదరి వంటి తారలు ఇప్పటికే ప్రేమాయణం చేస్తున్నారు.

Advertisement

టాలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది నటి రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పుడు ఆమె బాలీవుడ్‌ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో గాఢమైన ప్రేమలో మునిగితేలుతుంది. తాజాగా ఈ జంట తమ పెళ్లికి ముహూర్తం కుదుర్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 22న గోవాలో పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం.

ఇక ఇదే సమయంలో మిగతా ప్రేమజంటల పెళ్లిళ్ల గురించి కూడా కొన్ని వార్తలు జోరుగా వస్తున్నాయి. తమన్నా – బాలీవుడ్ నటుడు విజయ్‌ వర్మ గతకొంత కాలంగా ప్రేమలో ఉన్నారు. వీళ్లు కూడా తమ పెళ్లికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

అదితిరావు హైదరీ – హీరో సిద్ధార్థ్‌ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ జంట తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇక ఈ జంట కూడా ఈ ఏడాది ప్రథమార్ధంలోనే పెళ్లి చేసుకోబోతున్నారని సినీ వర్గాల్లో టాక్.

హీరోయిన్ శ్రుతిహాసన్‌ కొన్నాళ్లుగా శాంతను హజారికతో ప్రేమలో ఉన్నారు. అయితే ఈ మధ్య ఈ జంట పెళ్లి కూడా చేసుకున్నారనే వార్తలు జోరుగా వినిపించాయి. దీనిపై స్పందించిన శ్రుతి హాసన్.. పెళ్లి ఆలోచన వస్తే మొదట తానే చెబుతానని క్లారిటీ ఇచ్చారు.

ఇక తెలుగులో వరుస విజయాల్ని సొంతం చేసుకున్న హీరోయిన్ సంయుక్త మేనన్‌.. ప్రస్తుతం పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణంతోనే ఆమె కొత్త సినిమాలు ఒప్పుకోవడం లేదని టాలీవుడ్‌ వర్గాల సమాచారం.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×