BigTV English

IND Vs SA Second Test : ఈ మధ్యలో నేనేం మిస్సయ్యాను.. సచిన్ ఫన్నీ ట్వీట్..

IND Vs SA Second Test : ఈ మధ్యలో నేనేం మిస్సయ్యాను.. సచిన్ ఫన్నీ ట్వీట్..

IND Vs SA Second Test : సౌతాఫ్రికా గడ్డపై జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ పై సచిన్ టెండూల్కర్ ఆసక్తికర కామెంట్లు చేశాడు. ఫ్లయిట్ ఎక్కే ముందు టీవీ ఆన్ చేసి చూశాను. సౌతాఫ్రికా 55 ఆలౌట్ అని ఉంది. తీరా నేను ఫ్లయిట్ దిగి, ఇంటికి వచ్చేసరికి చూస్తే సౌతాఫ్రికా 3 వికెట్లకు 62 పరుగులను ఉంది.ఈ మధ్యలో నేనేం మిస్సయ్యాను? అని సరదాగా ట్వీట్ చేశాడు.


భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య సెంచూరియన్ వేదికగా బుధవారం ప్రారంభమైన రెండో టెస్టులో బౌలర్లు వికెట్ల పండగ చేసుకుంటున్నారు. ఇంకా వికెట్లు పడుతూనే ఉన్నాయి. తొలిరోజు తొలి ఇన్నింగ్స్ కా బాప్ సిరాజ్ కి, ఇంకా రెండో ఇన్నింగ్స్ లో వికెట్లు పడలేదు.రెండోరోజు ఆట ప్రారంభం కాగానే తనెలా విజృంభిస్తాడని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తొలిరోజు ఇరు జట్ల బౌలర్లు రాణించడంతో ఒకే రోజు 23 వికెట్లు పడ్డాయి. ఈ నేపథ్యంలో సచిన్ టెండూల్కర్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. మొదటి రోజు 23 వికెట్లు పడటం తనని షాకింగ్‌కు గురిచేసిందని పేర్కొన్నాడు.


”తొలి రోజు ఆటలో 23 వికెట్ల పడటం…అలా 2024 కొత్త ఏడాది మొదలవడం జరిగిందని వెరైటీగా చెప్పాడు. అంటే పాత సంవత్సరం 2023 కాబట్టి, 23 వికెట్ల పడ్డాయని, అలా 2024లోకి ఎంటర్ అయ్యామని వ్యాఖ్యానించాడు. ఇది నమ్మలేని నిజం, ఇప్పటికి నాకు డైజస్ట్ కావడం లేదు. ఇది వాస్తవమేనా? అని అన్నాడు.

నెట్టింట కూడా సచిన్ వ్యాఖ్యలకు సరదాగా కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు మొత్తం 22 ఆటగాళ్లలో… 46 పరుగులతో విరాట్ కోహ్లీ ఒక్కడే టాప్ స్కోరర్ గా ఉన్నారని కూడా కామెంట్ చేస్తున్నారు.

బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 6 వికెట్లు తీసి నెంబర్ వన్ గా ఉన్నాడని రాశారు. మ్యాచ్ గెలిచినా, గెలవకపోయినా రికార్డులు మాత్రం మనకే ఉంటాయని మరొకరు కామెంట్ చేశారు. ఇలా సచిన్ కామెంట్ పై పలువురు భిన్నంగా స్పందించడం విశేషం.

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×