Pooja Hegde : బుట్ట బొమ్మ పూజ హెగ్డే (Pooja Hegde) తాజాగా ఓ స్టార్ హీరో తో స్విమ్ వేర్ లో ఎంజాయ్ చేస్తూ కనిపించింది. ఆ హీరోతో కలిసి పరిగెత్తుతూ వెళ్లి, అమాంతం నీళ్ళలోకి దూకేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి పూజ హెగ్డే ఏ హీరోతో కలిసి ఇలా స్విమ్మింగ్ చేస్తోంది ? అనే వివరాల్లోకి వెళ్తే…
బాలీవుడ్ స్టార్ తో పూజా హెగ్డే సాహసం
పూజ హెగ్డే ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ (Varun Dhawan) తో కలిసి ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ (Hai Jawani Toh Ishq Hona Hai) అనే సినిమాలో నటిస్తోంది. రీసెంట్ గా వీరిద్దరూ రిషికేశ్ లో ఈ రొమాంటిక్ కామెడీ మూవీకి సంబంధించిన షూటింగ్ ని మొదలు పెట్టారు. ఈ మూవీకి వరుణ్ ధావన్ తండ్రి డేవిడ్ ధావన్ దర్శకత్వం వహిస్తుండగా, షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ మూవీ కోసం టీం ఇప్పటికే రిషికేష్ కి వెళ్లారు. అందులో భాగంగానే పరమార్థ్ నికేతన్ ఆశ్రమాన్ని సందర్శించి, అక్కడ మొక్కలను కూడా నాటారు. అనంతరం గంగా హారతి ఇచ్చి, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అంతలోనే తాజాగా వరుణ్ ధావన్, పూజా హెగ్డే తమ సోషల్ మీడియా ఖాతాలలో నది దగ్గర ఎంజాయ్ చేస్తున్న వీడియోను షేర్ చేశారు. ఆ పోస్ట్ కి రిషికేశ్ లో తదుపరి షెడ్యూల్లో కలుద్దాం అనే క్యాప్షన్ ఇచ్చారు. ఎట్టకేలకు అక్కడ షూటింగ్ పూర్తి చేశాక, ఇద్దరూ స్విమ్మింగ్ చేస్తూ కనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇక ఇందులో పూజ హెగ్డే స్విమ్ వేర్ లో అందంగా కనిపించింది. ఆ వీడియోలో వరుణ్ ధావన్ హీరోయిన్ తో కలిసి నీళ్లలోకి దూకుతూ సరదాగా టైం స్పెండ్ చేసినట్టుగా అర్థమవుతుంది. పూజా హెగ్డే చేతులు పట్టుకుని వరుణ్ పరిగెత్తించాడు. ఇద్దరూ ఒక్కసారిగా వాటర్ లోకి దూకి, ఆ తర్వాత స్విమ్ చేయడం మొదలుపెట్టారు.
కోలీవుడ్ స్టార్స్ తో వరుస సినిమాలు
ఇదిలా ఉండగా పూజ హెగ్డే ప్రస్తుతం అటు బాలీవుడ్ లో, ఇటు కోలీవుడ్లో బిజీ హీరోయిన్ గా మారింది. ఓవైపు హిందీలో సినిమాలు చేస్తూనే, మరోవైపు తమిళంలో వరుసగా స్టార్ హీరోలను లైన్ లో పెట్టింది. దళపతి విజయ్ సరసన ‘జననాయగన్’ అనే సినిమాలో ఈ అమ్మడు నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే సూర్య హీరోగా నటిస్తున్న ‘రెట్రో’ మూవీలో కూడా హీరోయిన్ గా కనిపించబోతోంది పూజ హెగ్డే. అంతేకాదు రాఘవ లారెన్స్ చేస్తున్న ‘కాంచన 4’ కూడా మూవీలో నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ అమ్మడు. అంతేకాదు రజినీకాంత్ హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైన ‘కూలీ’లో స్పెషల్ సాంగ్ చేయబోతోంది బుట్ట బొమ్మ. కొంతకాలం బ్రేక్ తరువాత రీఎంట్రీలో వరుస సినిమాలతో దూసుకెళ్తోంది ఈ అమ్మడు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">