Mastan Sai : మస్తాన్ సాయి కేసులో రోజుకో కొత్త కోణం బయటపడుతుంది. లావణ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన పోలీసులకు విచారణలో నివ్వెరపోయే నిజాలు తెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మస్తాన్ సాయి ఉరి వేసుకొని చనిపోతానంటూ మహిళల్ని బెదిరించిన ఓ వీడియో బయటకు వచ్చింది.
మస్తాన్ సాయి అరెస్ట్ తో ఆ వ్యక్తి ఆగడాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వందల సంఖ్యలో మహిళలను వేధించిన మస్తాన్ సాయి.. వారందరినీ బ్లాక్ మెయిల్ చేస్తూ తన అరాచకాలు కొనసాగించాడు. మహిళలను మానసికంగా, శారీరకంగా వేధించిన మస్తాన్ సాయి… పోలీసులకు ఫిర్యాదు చేయటానికి వెళుతుంటే బ్లాక్ మెయిల్ చేసి మరింతగా భయాందోళనకు గురిచేశాడు. ఆత్మహత్య చేసుకుంటున్నాను అంటూ ఫ్యాన్ కు ఉరి బిగించుకుని ఏడుస్తూ వీడియో కాల్స్ చేస్తూ పోలీసులకు సమాచారం ఇవ్వకుండా భయపెట్టాడు. తాజాగా ఈ వీడియో ఒకటి బయటకు వచ్చింది.
మస్తాన్ సాయి వంద మందికి పైగా మహిళలను ట్రాప్ చేసి అతి కిరాతకంగా అనుభవించాడు. వీరందరి వీడియోలు రికార్డ్ చేసి కొందరిని డ్రగ్స్ కు బానిసగా మార్చాడు. రికార్డ్ చేసిన వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతులను బూతులు తిడుతూ.. మానసిక క్షోభకు గురిచేశాడు.
మస్తాన్ సాయితో లావణ్యకు ఎఫైర్ ఉందని రాజ్ తరుణ్ తో సహా పలువురు ఆరోపించిన నేపథ్యంలో.. మస్తాన్ సాయి తనకు బెస్ట్ ఫ్రెండ్ అంటూ చెప్పుకు వచ్చిన లావణ్య చివరికి అతడిపైనే తీవ్ర ఆరోపణలు చేసింది. ఓ లేఖ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. “నేను, రాజ్ తరుణ్ కోకాపేటలో ఉంటున్న సమయంలో రాజ్ తరుణ్ కు గుంటూరు కు చెందిన రావలి రామ్మోహన్ రావు కుమారుడు బాలాజీ మస్తాన్ సాయితో ఉన్నత రెడ్డి అనే ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యాడు. అయితే 2022లో అయిన ఈ పరిచయంతో 2024 వరకూ నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నా. నవంబర్ 2024 లో మస్తాన్ సాయి ఇంటికి వెళ్లి తన 4 TB హార్డ్ డిస్క్ ను తీసుకొని వచ్చా. ఇలా చేయటానికి ప్రధాన కారణం ఏంటంటే.. హార్డ్ డిస్క్ లో మస్తాన్ సాయి మహిళలకు తెలియకుండా తీసిన వందల కొద్ది న్యూడ్ వీడియోలు ఉన్నాయి. ఇందులో కొందరు పెళ్లైన వాళ్ళు ఉండగా.. మరి కొంత మంది పెళ్ళికాని మహిళలు ఉన్నారు. వీరందరితో మస్తాన్ సాయి వందల కొద్ది ప్రైవేట్ ఫోటోలు దిగాడు. వీటితో పాటు మస్తాన్ సాయి మహిళలను హ్యాక్ చేసి స్టోర్ చేసుకున్న ప్రైవేట్ విషయాలు సైతం ఉన్నాయి. మహిళల ఫోన్ హ్యాక్ చేసి గూగుల్ అకౌంట్, గూగుల్ ఫొటోస్, ఐ క్లౌడ్ అకౌంట్స్ ను తన ఆధీనంలో పెట్టుకొని వారిని ఎదురు తిరగలేని స్థితికి తీసుకొచ్చాడు.
ALSO READ : రష్మీ గౌతమ్ పై నెటిజన్స్ ఫైర్.. ఇప్పటికైనా ఆపండంటూ..!
ఎదురు తిరిగితే వాళ్ళ కుటుంబం పరువు పోతుందని ఆలోచించిన ఆ మహిళలు అతడు చెప్పినట్టే విన్నారు. చేసిన అరాచకాలన్నీ భరించారు. మహిళలతో ఉన్న సమయంలో వీడియోలు తీసి వాటిని చూపిస్తూ వారిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఏ మహిళ ఎదురు తిరగలేదు. సెక్స్ కోరికలను పెంచే డ్రగ్స్ ఇస్తూ రాక్షసుడిలా ప్రవర్తించి తన కోరికలు తీర్చాలంటూ వారిని తీవ్రంగా వేధించాడు. వీటన్నిటిని వీడియోలో రికార్డ్ చేసి హార్డ్ డిస్క్ లో స్టోర్ చేశాడు. ఒక్కో అమ్మాయి దగ్గర ఒక్కో డ్రామా ప్లే చేస్తూ చచ్చిపోతానంటూ బెదిరించి వాళ్లు పోలీసుల వరకు వెళ్లకుండా చేశాడు. ఎందరో మహిళలతో ఉన్న కాల్ రికార్డింగ్స్ కూడా ఇందులో ఉన్నాయి” అంటూ లావణ్య పోలీసులకు లేఖ రాసి అందించింది.
మస్తాన్కేసులో మరో కోణం… ఆత్మహత్యాయత్నం వీడియో వైరల్ #Mastansai #lavanya #RajTarun #Nikhil pic.twitter.com/mg3lTmGcgO
— BIG TV Cinema (@BigtvCinema) February 4, 2025