Dimuth Karunaratne: ఛాంపియన్స్ ట్రోఫీ – 2025 కంటే ముందే శ్రీలంక క్రికెట్ జట్టుకి భారీ షాక్ తగిలింది. శ్రీలంక వెటరన్ ఓపెనర్ దిముత్ కరుణరత్నే {Dimuth Karunaratne} సుదీర్ఘ కెరీర్ కి గుడ్ బై చెప్పేశారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తాను తప్పుకుంటున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డుకి సమాచారం అందజేశాడు దిముత్ కరుణరత్నే. ఈ నెల 6వ తేదీ నుంచి గాలే వేదికగా ఆస్ట్రేలియాతో జరగబోయే టెస్ట్ మ్యాచ్ అతడి కెరీర్ లో ఆఖరి మ్యాచ్ అని తెలిపారు.
Also Read: Gongadi Trisha: తెలంగాణ తడాఖా చూపించా.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో త్రిష !
ఫిబ్రవరి 6న జరగబోయే ఈ చివరి టెస్ట్ కరుణరత్నే {Dimuth Karunaratne} కి ఓ మైల్ స్టోన్ కానుంది. అంతేకాదు అతడి కెరీర్ లో ఈ టెస్ట్ 100వది. ఈ క్రమంలోనే 100వ టెస్ట్ ఆడి ఆటకు గుడ్ బై చెప్పేందుకు ఇదే సరైన సమయమని అతడు భావిస్తున్నట్లు సమాచారం. దిముత్ కరుణరత్నే రిటైర్మెంట్ నిర్ణయం పై అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
సనత్ జయ సూర్య, మహేళ జయవర్ధనే, కుమార సంగార్కర వంటి దిగ్గజాల రిటైర్మెంట్ తర్వాత.. శ్రీలంక బ్యాటింగ్ కి మూల స్తంభంగా నిలిచిన కరుణరత్నే {Dimuth Karunaratne} రిటైర్మెంట్ ప్రకటన శ్రీలంక క్రీడాభిమానులను నిరాశకు గురిచేసింది. గత కొంతకాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న కరుణరత్నే తన 14 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్ కి గుడ్ బై చెప్పేందుకు ఇది కూడా ఓ కారణం అయ్యుండొచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దిమూత్ కరుణరత్నే {36} తన కెరీర్లో శ్రీలంక తరపున ఇప్పటివరకు 99 టెస్టుల్లో 7,172 పరుగులు చేశాడు. ఇక 50 వన్డేలో 1,316 రన్స్ చేశాడు. టెస్టుల్లో 16 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలతో ఓపెనర్ గా అద్భుతంగా రాణించాడు. 50 వన్డేల్లో ఒక సెంచరీ, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 30 టెస్ట్ లకు కెప్టెన్ గా వ్యవహరించిన దిముత్ కరుణరత్నే {Dimuth Karunaratne} ఇటీవల ఫామ్ కోల్పోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Also Read: IND Vs ENG ODI 2025: వన్డే సిరీస్ టైమింగ్స్.. ఉచితంగా ఎలా,ఎక్కడ చూడాలంటే..?
2024 సెప్టెంబర్ లో కరుణరత్నే {Dimuth Karunaratne} ఓ అరుదైన క్లబ్ లో చేరాడు. టెస్టుల్లో ఏడు వేల పరుగుల మైలురాయిని అధిగమించాడు. కరుణరత్నే కంటే ముందు సాగర్కర (12400), జయవర్ధనే (11,814), ఏంజెలో మ్యాత్యూస్ (7,766) టెస్టుల్లో శ్రీలంక తరపున 7వేల మార్కును దాటారు. టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కరుణ రత్నే 57వ స్థానంలో నిలిచాడు.
ఈ జాబితాలో టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (15,921) పరుగులతో అగ్రస్థానంలో ఉన్నారు. ఈ పరుగులతో కరుణరత్నే {Dimuth Karunaratne} దిగ్గజ బ్యాటర్ డాన్ బ్రాడ్ మాన్ ను అధిగమించారు. టెస్టుల్లో బ్రాడ్ మాన్ (6,996) పరుగులు చేశాడు. ఇక ప్రస్తుతం దిమూత్ కరుణరత్నే రిటైర్మెంట్ శ్రీలంక క్రికెట్ మీద తీవ్ర ప్రభావం చూపుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అతడు లేని లోటును శ్రీలంక ఎలా భర్తీ చేస్తుందో వేచి చూడాలి.