BigTV English

35 chinna katha kaadu: అరుదైన గౌరవం అందుకున్న 35 చిన్న కథ కాదు..!

35 chinna katha kaadu: అరుదైన గౌరవం అందుకున్న 35 చిన్న కథ కాదు..!

35 chinna katha kaadu.. నిన్ను కోరి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నివేదా థామస్ (Niveda Thomas )గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. బొద్దుగా కనిపించినా అందంగా తన అందమైన నటనతో ఎంతో మందిని తన వైపు తిప్పుకుంది. ఎన్నో చిత్రాలలో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈమె ఎన్టీఆర్ (NTR), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వంటి స్టార్ హీరోల సినిమాలలో కూడా నటించి ఆకట్టుకుంది. ఇకపోతే కొంతకాలం సినిమాలకు దూరమైన నివేదా థామస్ మళ్లీ ఇటీవలే 35 చిన్న కథ కాదు అనే సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ ఈమె లుక్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. విపరీతంగా బరువు పెరిగిపోయి అందరిని ఆశ్చర్యపరిచింది నివేదా.


35 చిన్న కథ కాదు సినిమాతో రీ ఎంట్రీ..

టాలీవుడ్ హీరోయిన్ గా పేరు దక్కించుకున్న నివేదా థామస్ , ప్రియదర్శి (Priyadarshi) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 35 చిన్న కథ కాదు. చాలా తక్కువ బడ్జెట్ తో విడుదలైన ఈ సినిమా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రముఖ డైరెక్టర్ నందు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ప్రియదర్శి టీచర్ గా నటించి ఆకట్టుకున్నారు. చిన్న సినిమాగా వచ్చినా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది . ఈ సినిమాకి ఒక అరుదైన గౌరవం లభించడం చిత్ర బృందాన్ని ఆనందంలో ముంచేత్తుతోంది. తాజాగా ఈ సినిమాకి ఒక అరుదైన గౌరవం లభించింది.


అరుదైన గౌరవం దక్కించుకున్న 35 చిన్న కథ కాదు..

అసలు విషయంలోకి వెళితే.. గోవాలో జరగనున్న ప్రముఖ ఇండియన్ పనోరమా ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ లో 35 చిన్న కథ కాదు చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. గోవాలోని పనాజీలో నవంబర్ 20 నుంచి 28 వరకు జరిగే ఈ కార్యక్రమాలలో మొత్తం 25 మూవీలను ప్రదర్శించబోతున్నారు. అందులో భాగంగానే 384 సినిమాలను ఎంపిక చేయగా తెలుగు నుంచి ఒక్క 35 చిన్న కథ కాదు సినిమా మాత్రమే ఎంపికయింది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటిస్తూ తమ ఆనందాన్ని పంచుకుంది. ఏదిఏమైనా రీ ఎంట్రీ లో నివేదా తన అదృష్టాన్ని పరీక్షించుకొని సక్సెస్ అయ్యింది అని చెప్పవచ్చు.

చిన్న చిత్రంగా వచ్చి భారీ సక్సెస్..

ఇకపోతే రానా (Rana ) సమర్పణలో సెప్టెంబర్ ఆరవ తేదీన ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని భారీగా కలెక్షన్లు రాబట్టినట్లు సమాచారం. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని థియేటర్లలో కూడా మంచి ఆదాయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటిటిలో కూడా సందడి చేస్తోంది. ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఇప్పుడు ఇండియన్ పనోరమా ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబోతుండడంతో పలువురు సెలబ్రిటీలు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×