BigTV English

CJI Chandrachud: సాక్షాత్తు సీజేఐకు కూడా పొల్యూషన్ ఎఫెక్ట్.. మార్నింగ్ వాక్ కు స్వస్తి.. వారి సూచన మేరకే అంటూ..

CJI Chandrachud: సాక్షాత్తు సీజేఐకు కూడా పొల్యూషన్ ఎఫెక్ట్.. మార్నింగ్ వాక్ కు స్వస్తి.. వారి సూచన మేరకే అంటూ..

CJI Chandrachud: ఆయన దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి. దేశ రాజధానిలో ఉంటున్న ఆయన.. ఓ సమస్యను ఎదుర్కొన్నారట. ఆ ఒక్క సమస్యతో మార్నింగ్ వాక్ కు స్వస్తి పలికారు. ఇంతలా సీజేఐ కు ఇబ్బంది పెట్టిన సమస్య ఏమిటో తెలుసా.. అదే కాలుష్యం.
దేశ రాజధాని ఢిల్లీలో పొగ, ధ్వని కాలుష్యం మితిమీరిన స్థితిలో ఉంటాయని అప్పుడప్పుడు మనకు వార్తలు వినిపిస్తుంటాయి. ఇక పొగ కాలుష్యం గురించి చెప్పాలంటే మాటలు చాలవంటారు ఢిల్లీ వాసులు. అందుకే ఢిల్లీలో అధికారంలో గల ఆప్ ప్రభుత్వం కాలుష్యాన్ని తగ్గించేందుకు, కొన్ని చర్యలు తీసుకున్నా అంతలా సమస్య పరిష్కారం కాలేదన్నది పలువురి వాదన.


తాజాగా ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ చేసిన వ్యాఖ్యలు, అక్కడి కాలుష్యం యొక్క స్థితిగతులను తెలియజేస్తున్నాయి. వచ్చేనెల 10వ తేదీన పదవీ విరమణ చేయనున్న సీజేఐ, ఇటీవల సుప్రీంకోర్టు ఆవరణంలో మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. ఆ క్రమంలో ఢిల్లీలో గల పొల్యూషన్ గురించి సీజేఐ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

దేశ రాజధానిలో అధిక పొల్యూషన్ వల్ల మార్నింగ్ వాక్ కు వెళ్లడం మానేసినట్లు, ఇటీవల డాక్టర్లను కలిసిన సమయంలో పగటిపూట బయటకు వెళ్లొద్దని తనకు సూచించినట్లు సీజేఐ చెప్పారట. అంతేకాదు కాలుష్యం ధాటికి శ్వాసకోశ వ్యాధులు వస్తాయని డాక్టర్లు చెప్పడంతో పూర్తిగా మార్నింగ్ వాక్ కు స్వస్తి పలికినట్లు మీడియా ప్రతినిధులతో తాను ఎదుర్కొన్న సమస్య గురించి సీజేఐ వివరించారట.


Also Read: Indian Railway Lines: దేశంలో రైల్వే లైన్ లేని ఏకైక రాష్ట్రం ఇదే.. కారణాలు ఏంటో తెలుసా?

సాక్షాత్తు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కి, కాలుష్య సమస్య ఎదురు కావడాన్ని బట్టి చూస్తే, ఇక సామాన్య ప్రజానీకం పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావనే చెప్పవచ్చు. భావితరాలకు కాలుష్య రహిత పర్యావరణాన్ని అందించాలన్న లక్ష్యం ఏమో కానీ, నేటి తరానికే పొల్యూషన్ ఎఫెక్ట్ ఉందని, ప్రజలు ఇప్పటికైనా చైతన్యవంతులై, మొక్కలను నాటడం, వాటిని పరిరక్షించడం వంటి చర్యలతో పాటు, కాలుష్య రహిత సమాజం కోసం పాటుపడాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య సమస్యను నివారించేందుకు ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉందని, అలాగే ప్రజల్లో చైతన్యం నింపేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించాల్సిన ఆవశ్యకత ఉందని వారు భావిస్తున్నారు. మరి ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×