Harihara Veeramallu : టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న, మరోవైపు ఆయన్ను సినిమాలో చూడాలని అభిమానులు ఎంతగానో ఆశపడుతున్నారు. ఇప్పటివరకు ఒప్పుకున్నా సినిమాలైనా పూర్తి చెయ్యాలని కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాల కోసం అభిమానులు ఎంతగా వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు.. ఈ సినిమా త్వరలోనే రాబోతుందని మేకర్స్ ప్రకటించినప్పటి నుంచి అభిమానులు ఆ సినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆ సమయం వచ్చేసింది.. ఈనెల 28న సినిమా రిలీజ్ అయిపోతుందని చిత్ర యూనిట్ ఎప్పుడో ప్రకటించింది. అయితే కాస్త షూటింగ్ పెండింగ్ ఉన్న కారణంగా మూవీ వాయిదా మే కు షిఫ్ట్ అయ్యింది. ఇదైన ఉంటుందో లేదో చూడాలి..
హరిహర వీరమల్లు..
హరిహర వీరమల్లు చిత్రాన్ని ముందుగా డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించిన కూడా కొన్ని కారణాలవల్ల క్రిష్ సినిమా నుంచి తప్పుకున్నాడు.. ప్రస్తుతం జ్యోతి కృష్ణ దర్శకత్వంలో చివరి దశ పనులు జరుపుకుంటోంది. ఈ నెలలోనే సినిమాను విడుదల చేయాలని భావించినప్పటికీ షూటింగ్ ఆలస్యం కావడంతో మే 9కి వాయిదా వేసిన విషయం తెల్సిందే. పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ మధ్య సాగే లవ్ సాంగ్ కొల్లగొట్టినాదిరో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కీరవాణి సంగీతం అందించిన ఆ పాటకు మంచి స్పందన వచ్చింది. సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉన్న ఆ పాటను మరింతగా ప్రమోట్ చేస్తుంది. అటు సోషల్ మీడియాలో కూడా ఈ సాంగ్ ట్రెండ్ అవుతుంది. మొన్న విడుదలైన ‘మాట వినాలి ‘ సాంగ్ కూడా మంచి రెస్పాన్స్ ను అందుకుంది. ఈ పాటలు సినిమాపై అంచనాలను పెంచేసాయి. దాంతో ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తామని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.
అసలు వీరమల్లును ఎందుకు చూడాలి..?
ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో జోరుని పెంచారు. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న నిధి అగర్వాల్ సినిమా ప్రమోషన్స్ బాధ్యతను తన భుజాన వేసుకుంది. పలు ఇంటర్వ్యూ లతో పాటు టీవీ షో లో కూడా పాల్గొంటూ సినిమాని తనదైన స్టైల్ లో ప్రమోట్ చేస్తుంది. తాజాగా ఈ సినిమాను చూడడానికి అలా ఐదు కారణాల గురించి మీది అగర్వాల్ బయట పెట్టింది. ఈ సినిమాని ఎందుకు చూడాలి అనేదానికి ఐదు కారణాలు ఏంటంటే..
*. పవన్ కళ్యాణ్ సినిమాలంటే జనాలకు పిచ్చి అందుకే ఆయన నటన ఈ సినిమాలో కొత్తగా ఉంటుంది కాబట్టి ఈ సినిమాని తప్పక చూడాలి..
*. గతంలో పవన్ కళ్యాణ్ నటించిన స్టోరీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. కానీ ఈ సినిమా డిఫరెంట్ స్టోరీ తో రాబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ సినిమాని చూడాల్సిందే.
*. ఈ సినిమాలోని ఫైట్స్, విజువల్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయని నిధి అగర్వాల్ అంటున్నారు.
*. గ్రేట్ యాక్షన్, డ్రామా సన్నివేశాలు ఉంటాయి.
*. చివరగా, నేను ఇందులో కొత్తగా కనిపిస్తాను. నాకోసం సినిమాను తప్పక చూడాలి ని ఆమె అన్నారు.
పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు చేసిన సినిమా స్టోరీలు లవ్ యాక్షన్ డ్రామా గా ఉంటాయి. కానీ ఈ సినిమా మొత్తం ఒక యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపిస్తాడు. అందులో ఇప్పుడు ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ సినిమా రిలీజ్ అవ్వడంతో, ఈ సినిమాని చూసేందుకు జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటివరకు ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి..