#90s Biopic.. ఒకప్పుడు హీరోగా నటించి, ఆ తర్వాత విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు శివాజీ (Shivaji) . ఇక బిగ్ బాస్ సీజన్ 7 లో కూడా పాల్గొని, అందరిని ఆకట్టుకున్నారు. ఈ షో తర్వాత ఆయన విడుదల చేసిన వెబ్ సిరీస్ “90స్-ఎ మిడిల్ క్లాస్ బయోపిక్”. ఈ వెబ్ సిరీస్ కి పెద్దగా ప్రమోషన్స్ చేపట్టకపోయినా.. ఈటీవీ విన్ యాప్ లో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు అత్యధికంగా వీక్షించిన వెబ్ సీరీస్ గా కూడా రికార్డు సృష్టించింది. 90స్-ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ కి ఆదిత్య హాసన్ (Adhitya Hassan) దర్శకత్వం వహించగా.. శివాజీ వాసుకి, ఆనంద్ రోహన్, వాసంతిక, మౌళి ఇలా ఐదు మంది ప్రధాన పాత్రలో నటించారు.
90 స్ సీక్వెల్ సిద్ధం..
ఇకపోతే తాజాగా.. ఈ వెబ్ సిరీస్ కి సీక్వెల్ కూడా సిద్ధం అయిపోయిందని అనౌన్స్మెంట్ చేస్తూ.. ఇందులో హీరో, హీరోయిన్ ప్రేమ కథను చూపించడానికి సిద్ధం అయ్యాము అంటూ ఒక వీడియోని రిలీజ్ చేశారు మేకర్స్. ఇకపోతే ఈ వెబ్ సిరీస్ హీరో ఎవరో కాదు ఆనంద్ దేవరకొండ (Anandh Deverakonda). ‘బేబీ’ చిత్రంతో భారీ పాపులారిటీ అందుకున్నారు. ఇందులో హీరోయిన్ గా వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) చాలా అద్భుతంగా నటించింది. ఇక అలాగే 90స్ వెబ్ సిరీస్ తో దర్శకుడు ఆదిత్య హాసన్ కూడా ప్రతి కుటుంబానికి చేరువయ్యారు. ఇప్పుడు ఈ ముగ్గురు యువ సంచలనాలతో వరుస ఘన విజయాలతో దూసుకుపోతున్న ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ తన ప్రొడక్షన్ నెంబర్ 32 ని ప్రకటిస్తూ.. ఒక అనౌన్స్మెంట్ వీడియోని విడుదల చేయడం జరిగింది.
హీరోగా ఆనంద్ దేవరకొండ..
90 సిరీస్ లో చిన్నపిల్లవాడు ఆదిత్య పాత్రలో మౌళి ఎంతగా ఆకట్టుకున్నాడో అందరికీ తెలుసు. ఇప్పుడు ఆదిత్య పాత్ర పిల్లాడు 10 సంవత్సరాల తర్వాత పెద్దవాడు అయ్యాడు. మరి ఆ పాత్రను ఆనంద్ దేవరకొండ పోషిస్తే..? దీనికి తోడు ఆయనకు ఒక అందమైన ప్రేమ కథ ఉంటే ఎలా ఉంటుంది? అనే ఆలోచన నుంచి ఈ ప్రేమ కథ పుట్టినట్టుగా అనౌన్స్మెంట్ వీడియోలో చూపించడం జరిగింది. ఇక ఈ వీడియోలో శివాజీ, వాసుకి, మౌళి పాత్రల మధ్య కొంత సన్నివేశాన్ని చూపించి, ఆ తర్వాత ఆనంద్ దేవరకొండ ను చూపించారు. శివాజీ, వాసుకి ముసలి వాళ్ళయినట్టు చూపించడానికి, కలర్ వేసుకుంటున్నట్టు చూపించారు. ఇక చివర్లో ఆదిత్య పాత్రలో నటిస్తున్న ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ..”మీరు టీవీలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామా ఇప్పటికే చూశారు కదా.. ఇప్పుడు థియేటర్లలో ఒక మిడిల్ క్లాస్ బాయ్ లవ్ స్టోరీని చూడబోతున్నారు. ఇది నా స్టోరీ.. నీ స్టోరీ.. కాదు మన స్టోరీ.. మోస్ట్ రిలేటబుల్ లవ్ స్టోరీ” అంటూ వీడియో చివర్లో ఆనంద్ దేవరకొండ డైలాగ్ చెప్పడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ఈ సిరీస్ కి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. ఆనంద్ దేవరకొండకు జోడీ గా వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) మళ్లీ జతకట్టబోతోంది. శ్రీకర స్టూడియో సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.