Akkineni Nagarjuna: అక్కినేని నాగేశ్వరరావు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటనతో ప్రేక్షకులను ఎంతగా మెప్పించారో.. ఇండస్ట్రీ కోసం ఎన్నో సేవలు కూడా అందించారు. అప్పట్లో స్టూడియోస్ కోసం మద్రాస్ వెళ్లాల్సివస్తుందని.. ఆయనే సొంతంగా హైదరాబాద్ లో ఒక స్టూడియోను నిర్మించారు. అదే అన్నపూర్ణ స్టూడియోస్. టాలీవుడ్ లో మొట్టమొదటి స్టూడియోను నిర్మించిన ఘనత రఘుపతి వెంకయ్య నాయుడుకు దక్కింది.
ఇక ఆయన స్ఫూర్తిగా ఏఎన్నార్ .. అన్నపూర్ణ స్టూడియోస్ పేరుతో స్టూడియోను నిర్మించారు. ఇప్పుడు తెలుగులోనే కాదు దేశంలోనే టాప్ 10 స్టూడియోస్ లో అన్నపూర్ణ స్టూడియోస్ ఒకటి. ఇక ఈ సంక్రాంతికి ఈ స్టూడియో నిర్మించి 50 ఏళ్లు పూర్తయ్యాయి. 1975 ఆగస్టు 14 న అన్నపూర్ణ స్టూడియోస్ కి పునాది రాయి పడింది. ఈ 50 ఏళ్లు అక్కినేని లెగసీ.. అన్నపూర్ణ స్టూడియోస్ తోనే ముడిపడి ఉంది. ఏఎన్నార్ బతికిఉన్నంత కాలం.. ఈ స్టూడియోను తన సొంత ఇల్లులా చూసుకున్నారు. ఇక ఆయన మృతి చెందాకా ఆ లెగసీని ఏఎన్నార్ వారసుడు అక్కినేని నాగార్జున కొనసాగిస్తున్నాడు.
అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నాగార్జున తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ లోని ప్రతి స్థలంలో తన తల్లిదండ్రులు ఉన్నారని ఎమోషనల్ అవుతూ ఒక వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. “రోడ్లే లేని సమయంలో నాన్నగారు ఇక్కడకు వచ్చి అన్నపూర్ణ స్టూడియోస్ ను ఎలా స్థాపించారో నాకు ఇప్పటికీ అర్ధం కావడం లేదు. కానీ, ఒక్కటి మాత్రం తెలుసు. అన్నపూర్ణ స్టూడియోస్ ఎంతోమంది గొప్ప గొప్ప నటులు, టెక్నీషయన్స్, డైరెక్టర్స్, ఆరిస్ట్స్ లకు ఉపాధి కలిగించింది.
#90s Biopic: సీక్వెల్ సిద్ధం.. హీరో రివీల్ చేస్తూ అనౌన్స్మెంట్ వీడియో వదిలిన మేకర్స్..!
అన్నపూర్ణ స్టూడియోస్ కి 50 వ ఏడాది మొదలయ్యింది. అన్నపూర్ణ అనే పేరు ఎలా వచ్చింది అంటే.. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందని నాన్నగారు నమ్మేవారు. అలా తన విజయం వెనుక మా అమ్మగారు ఉంటారని నమ్మి ఆమెపేరునే ఈ స్టూడియోకు పెట్టారు. అన్నపూర్ణ స్టూడియోస్ కు అలా పేరు వచ్చింది. ఇక్కడకు వచ్చిన ప్రతిసారి అమ్మానాన్న ఇక్కడే ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న ప్రతి ప్లేస్ వాళ్ల ఫేవరేట్.
అన్నపూర్ణ స్టాఫ్.. కాదు వాళ్లు స్టాఫ్ కాదు ఫ్యామిలీ. నాన్నగారు వాళ్ళను ఎప్పుడు స్టాఫ్ లా చూడలేదు. స్టూడియో ఇలా కళకళలాడుతూ ఉంటుంది నాటే దానికి కారణం వారే. వారు అన్నపూర్ణ యోధులు. వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 50 ఏళ్ళ క్రితం సంక్రాంతి పండగకు అన్నపూర్ణ స్టూడియోస్ ఓపెన్ అయ్యింది. ఆ తరువాత ప్రతి సంక్రాంతి పండగకు నాన్నగారు, అమ్మగారు అన్నపూర్ణ ఫ్యామిలీతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేసేవారు. ఆ ట్రెడిషన్ ఇప్పుడు కూడా అలానే కొనసాగుతుంది. మా లైఫ్ లో నాన్నగారు ఒక పెద్ద ఇన్స్ఫిరేషన్. నాకే కాదు చాలామంది ఆయన గురించి చెప్తూనే ఉంటారు” అని చెప్తూ ఏఎన్నార్ విగ్రహం వద్ద నాగ్ బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారాయి.