Casting Couch: క్యాస్టింగ్ కౌచ్ అనేది సినీ పరిశ్రమలో చాలా కామన్ అని, అలాంటి కమిట్మెంట్‌కు ఒప్పుకుంటేనే ఎవరైనా హీరోయిన్ అవ్వగలరు అని చాలామంది నటీమణులు ఇప్పటికే ఓపెన్‌గా బయటపెట్టేశారు. కానీ చాలావరకు స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన నటీమణులు మాత్రం వారు అలాంటి సమస్యలు ఏమీ ఎదుర్కోలేదని కొట్టిపారేస్తుంటారు. కొందరు నటీమణులు వారు చెప్పింది నిజమని నమ్మించడానికి ఆధారాలు సైతం బయటపెడతారు. తాజాగా అలాంటి ఒక ఆధారం బయటపడి కోలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఒక తమిళ నటికి సంబంధించిన 14 నిమిషాల వీడియో లీక్ అవ్వడంతో తన కెరీర్ నాశనం అయిపోయినట్టే అంటూ కోలీవుడ్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఎక్కడ నుండి వచ్చింది.?
తమిళ టీవీ షోల ద్వారా కెరీర్‌ను ప్రారంభించిన ఒక నటి.. మెల్లగా వెండితెరపై తన టాలెంట్ నిరూపించుకోవాలని అనుకుంది. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అవకాశాలు రావడంతో అలా తన కెరీర్‌ను ముందుకు నడిపించింది. బుల్లితెరపై, వెండితెరపై మాత్రమే కాదు.. సోషల్ మీడియాలో కూడా విపరీతమైన పాపులారిటీ అందుకుంది ఈ అమ్మాయి. ఇంతలోనే ఈ అమ్మాయికి సంబంధించిన ఒక క్యాస్టింగ్ కౌచ్ (Casting Couch) వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అసలు ఈ వీడియో ఎవరు తీశారు, ఎక్కడ నుండి వచ్చిందో తెలియదు కానీ.. తమిళ సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఎంత పెద్ద సమస్యగా మారిందో ఈ 14 నిమిషాల లీక్ అయిన వీడియో చూస్తే ప్రేక్షకులకు క్లారిటీ వచ్చేస్తోంది.
ఫేక్ అయ్యిండొచ్చు
ఆ నటి ఆడిషన్ కోసం వెళ్లినప్పుడు క్యాస్టింగ్ కౌచ్ లాంటి చేదు అనుభవం ఎదురయ్యిందని, అదే సమయంలో ఈ వీడియో రికార్డ్ అయ్యిందని స్పష్టమవుతోంది. కేవలం ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ మాత్రమే కాదు.. టెలిగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో కూడా ఈ వీడియో వైరల్ అయ్యింది. వీడియో వైరల్ అవ్వడం ఆలస్యం వెంటనే దీనికి లక్షల్లో వ్యూస్ రావడంతో పాటు ప్రేక్షకుల్లో ఇదే హాట్ టాపిక్‌గా కూడా మారింది. సినీ పరిశ్రమలో అవకాశాల పేరుతో ఇంత మోసం జరుగుతుందా అని కొందరు అనుకుంటుంటే.. మరికొందరు మాత్రం అసలు ఇది రియల్ వీడియో అని నమ్మడానికి సిద్ధంగా లేరు. ఇది డీప్‌ఫేక్ టెక్నాలజీ ద్వారా క్రియేట్ చేసిన వీడియో కూడా అయ్యిండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Also Read: గుడిలో నటుడి పిచ్చి పనులు.. సప్తగిరి వల్ల తప్పిన పెను ప్రమాదం
ట్విటర్‌లో ట్రెండ్
అసలు ఈ వీడియో ఏ సోర్స్ నుండి బయటికి వచ్చిందో తెలియకపోవడం వల్ల కూడా ఇది ఒరిజినల్ కాదని చాలామంది ప్రేక్షకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ మరికొందరు మాత్రం నిజంగానే ఈ నటి క్యాస్టింగ్ కౌచ్‌కు బాధితురాలిగా మారిపోయిందని భావిస్తున్నారు. తన పేరు ప్రస్తుతం ట్విటర్‌లో ట్రెండ్ అవుతోంది. తనకు న్యాయం జరగాలంటూ చాలామంది నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాల్లో మాత్రమే కాదు.. ఎన్నో అనాధికారిక సైట్స్‌లో కూడా ఇప్పటికే ఈ వీడియో అప్లోడ్ అయ్యింది. ఇప్పటికే ఈ వీడియోకు సంబంధించిన 12 డమ్మీ వీడియోలు కూడా రెడీ అయిపోయాయని సమాచారం.