Kannappa: మంచు విష్ణు (Manchu Vishnu) ప్రెస్టీజియస్ మూవీ గా తెరకెక్కుతున్న ‘కన్నప్ప’ సినిమా గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. భారీ బడ్జెట్ తో.. ఊహించని అంచనాలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అంతేకాదు ఈ సినిమాలోకి భారీ స్టార్ క్యాస్ట్ ఎంటర్ అవ్వడమే కాకుండా.. వారందరూ కూడా భిన్న విభిన్నమైన పాత్రలతో మునుపెన్నడూ చేయని విధంగా.. సరికొత్త పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే ఏవీఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల పై డాక్టర్ మోహన్ బాబు (Mohan babu) నిర్మిస్తున్న ఈ సినిమాకి ముఖేష్ కుమార్ సింగ్ (Mukhesh Kumar Singh) దర్శకత్వం వహిస్తున్నారు.
విడుదలకు సిద్ధమైన కన్నప్ప..
ఇక ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas), కాజల్ అగర్వాల్(Kajal Agarwal), మోహన్ లాల్(Mohan Lal), అక్షయ్ కుమార్ (Akshay Kumar) తదితరులు కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇక వీరితో పాటు ఆర్ .శరత్ కుమార్, ప్రీతి ముకుందన్, బ్రహ్మానందం, మధుబాల, రాహుల్ మాధవ్, కౌశల్ , రఘుబాబు, ఐశ్వర్య, దేవరాజు, సప్తగిరి వంటి వారు కూడా భాగమయ్యారు అంతేకాదు మంచు విష్ణు కూతుర్లు అరియానా, వివియానా కూడా భాగమైన విషయం తెలిసిందే. తొలిసారి వీళ్ళిద్దరూ కూడా ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. ఏప్రిల్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే పలువురు స్టార్ సెలబ్రిటీల పోస్టర్స్ రిలీజ్ చేశారు. కానీ ఏ ఒక్క పోస్టర్ కూడా సినిమాపై అంచనాలు పెంచలేకపోయింది. పైగా ఆ పోస్టర్స్ ట్రోల్స్ కూడా ఎదుర్కొన్నాయి.
కౌశల్ ఫస్ట్ లుక్ రివీల్..
ఇక ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాలో కౌశిక్ కూడా నటిస్తున్నట్లు ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో ‘మాలీ’ అనే పాత్రలో కౌశల్ నటిస్తున్నారు. ఇక ఈ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రివీల్ చేయడంతో.. ఇందులో కౌశల్ కూడానా..? ఇంకెంత మంది ఈ సినిమాలో నటిస్తున్నారు.. అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా సినిమాపై హైప్ తీసుకురావడానికి.. ఒక్కో క్యారెక్టర్ కి సంబంధించిన పాత్రను రివీల్ చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ ప్రమోషన్స్ సినిమాపై ఎలాంటి బజ్ క్రియేట్ చేస్తాయో చూడాలి.
కన్నప్ప కోసం ప్రాణం పెట్టేసిన మంచు విష్ణు..
ఇక మంచు విష్ణు విషయానికి వస్తే.. ఎంతో ప్రెస్టేజియస్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఎంతలా అంటే ఆఖరికి కుటుంబంలో తండ్రి మోహన్ బాబు, తమ్ముడు మంచు విష్ణు (Manchu Vishnu) మధ్య గొడవలు కోర్టు వరకు వెళ్లినా సరే వాటి విషయంలో తల దూర్చకుండా సినిమాపై ఫోకస్ చేశారు అంటే.. ఇక ఆయన ఎంతలా ఈ సినిమా కోసం కష్టపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. అంతే కాదు ఒకవైపు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడుతూ.. అక్కడ ఆడవారికే కాదు ఇండస్ట్రీకి వచ్చిన కష్టాలను తీర్చడానికి ముందడుగు వేసిన ఈయన.. మరొక పక్క డ్రీమ్ ప్రాజెక్టును కూడా ఫినిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ కష్టం ఫలితం.. కన్నప్ప సినిమా ద్వారా ఏ విధంగా లభిస్తుందో చూడాలి.