BigTV English

Jailer 2 Update : జైలర్ గ్యాంగ్ లోకి టాలీవుడ్ సీనియర్ హీరో… అసలు మీరు ఏం ప్లాన్ చేస్తున్నార్రా…

Jailer 2 Update : జైలర్ గ్యాంగ్ లోకి టాలీవుడ్ సీనియర్ హీరో… అసలు మీరు ఏం ప్లాన్ చేస్తున్నార్రా…

Jailer 2 Update :సాధారణంగా ఒక సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్నారని తెలిసిందంటే చాలు.. ఆ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తారు. ముఖ్యంగా సినిమా షూటింగ్ మొదలుపెట్టినప్పటి నుంచి ఆ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందా? అని ఆరాటపడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఒక సినిమాలో ఇద్దరు కాదు ముగ్గురు కాదు ఏకంగా నలుగురు హీరోలు అని తెలిస్తే ఇక అభిమానులు ఆగుతారా? ఎప్పుడెప్పుడు సినిమా షూటింగ్ మొదలు పెడతారు? ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తుంది? అసలు ఏ కథాంశంతో వస్తోంది? ఎవరు ఏ క్యారెక్టర్ పోషించబోతున్నారు? ఇలా పలు రకాల అనుమానాలు వ్యక్తం చేస్తారు. సినిమా షూటింగ్ మొదలు పెట్టిన తర్వాత మధ్యలో ఆలస్యమైతే మేకర్స్ ని సైతం తమ కామెంట్లతో విమర్శలు గుప్పిస్తారు. ఈ క్రమంలోనే జైలర్ 2 సినిమా గురించి ఒక తాజా అప్డేట్ అభిమానులలో గూస్ బంప్స్ తెప్పిస్తోంది. మరి అదేంటో ఇప్పుడు చూద్దాం.


జైలర్ 2 నుంచీ అదిరిపోయే అప్డేట్..

సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth)హీరోగా నటించిన చిత్రం జైలర్(Jailer )..ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు రజినీకాంత్ కెరియర్ లోనే అత్యధిక వసూలు రాబట్టిన సినిమాగా నిలిచిపోయి.. దాదాపు రూ.650 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది.. ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dileep Kumar) దర్శకత్వం వహించారు. రజినీకాంత్ హీరోగా నటించిన ఈ సినిమాలో శివరాజ్ కుమార్ (Shiva Raj Kumar), మోహన్ లాల్ (Mohanlal) గెస్ట్ రోల్స్ చేశారు. ముఖ్యంగా జాకీశ్రాఫ్ (Jocky shroff) కూడా కొద్దిసేపు గెస్ట్ రోల్ పోషించారు. మరి ఈ సినిమా హిట్ కావడంతో దాని సీక్వెల్ ని కూడా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.. అయితే ఈ సినిమా నుంచి ఒక ప్రకటన రాబోతోంది అని సంక్రాంతి సందర్భంగా అనగా రేపు జనవరి 14వ తేదీన ఈ సినిమా అప్డేట్ ప్రకటిస్తారని, అంతేకాదు సన్ పిక్చర్స్ ఒక అప్డేట్ కి సంబంధించి క్రేజీ ప్రోమోను కూడా ప్లాన్ చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి.


రేపే టీజర్ విడుదల..

ముఖ్యంగా తమిళనాడులోని కొన్ని థియేటర్లలో ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన ఏదైతే చేస్తున్నారో ఆ ప్రకటనకు సంబంధించి టీజర్ ని విడుదల చేయబోతున్నారట. ఆ విషయం ఏంటి అనేది వెల్లడించలేదు. కానీ జైలర్ 2 ప్రకటన గురించి ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇందులో క్యాస్టింగ్ గురించి పలు వార్తలు వైరల్ అవుతున్నాయి.

గెస్ట్ రోల్ పోషించనున్న బాలయ్య..

తాజాగా డాకు మహారాజ్ (Daaku Maharaj) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలకృష్ణ ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తారని సమాచారం. గతంలోనే జైలర్ సినిమాలో గెస్ట్ రోల్ చేయబోతున్నారంటూ వార్తలు వచ్చినా.. అది కేవలం రూమర్ గానే మిగిలిపోయింది. ఇప్పుడు మరొకసారి జైలర్ 2 లో కీలక పాత్ర పోషిస్తున్నారని వార్తలు మళ్లీ వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఒకవేళ ఇదే నిజమైతే రజినీకాంత్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ తో పాటు బాలకృష్ణ కూడా కనిపించబోతున్నారని సమాచారం. మొత్తంగా నాలుగు భాషల నుంచి నలుగురు స్టార్స్ తో జైలర్ 2 సినిమాని ప్లాన్ చేస్తున్నారని గుసగుసలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఇకపోతే దీనిపై నిజా నిజాలు తెలియాలి అంటే రేపు దీని నుంచి వచ్చే టీజర్ క్లారిటీ ఇస్తుందని చెప్పవచ్చు. ఒకవేళ ఇదే నిజమైతే ఫ్యాన్స్ కి పూనకాలే కాదు బాక్సాఫీస్ షేక్ అవడం ఖాయం అని అప్పుడే ట్రేడ్ విశ్లేషకులు కూడా చెబుతున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×