Manchu Family : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బడా కుటుంబముగా పేరు సొంతం చేసుకుంది మంచు ఫ్యామిలీ (Manchu family).ఈ కుటుంబం క్రమశిక్షణకు కేరాఫ్ అడ్రస్ అని అందరికీ తెలిసిందే. ముఖ్యంగా మోహన్ బాబు(Mohan babu ) క్రమశిక్షణకు ఎంత ప్రయారిటీ ఇస్తారంటే.. తనతో పాటు పనిచేసే వారు కూడా అలాగే ప్రవర్తించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా అది సినిమా అయినా కాలేజ్ అయినా ఏ విషయంలోనైనా సరే క్రమశిక్షణ పాటించాలని చెబుతూ ఉంటారు. అలాంటి ఈ కుటుంబంలో గొడవలు ఒక్కసారిగా రోడ్డుపైకి రావడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సమస్య ఏదైనా సరే ఇంట్లోనే నాలుగు గోడల మధ్య పరిష్కరించే మోహన్ బాబు. ఎందుకు కొడుకు విషయంలో వెనకడుగు వేస్తున్నారు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
మా పొట్ట కొట్టకండి అంటూ మనోజ్ పై ఫైర్ అయిన సర్పంచ్..
ఇదిలా ఉండగా సంక్రాంతి పండుగ సందర్భంగా.. తిరుపతిలో మంచు మనోజ్ (Manchu Manoj ), మోహన్ బాబు(Mohan babu ) వర్గీయుల మధ్య గొడవలు జరగడం, డెయిరీ ఫార్మ్ వద్ద జరిగిన సంఘటన అన్ని కూడా ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అటు మంచు మనోజ్ తాను ఆస్తుల కోసం రాలేదని, మోహన్ బాబు యూనివర్సిటీలో అన్యాయం జరుగుతోందని, దానిని ప్రశ్నించడం వల్లే తమపై దాడి చేస్తున్నారు? అంటూ మనోజ్ తెలిపారు. అయితే ఇప్పుడు ఈ విషయాలన్నింటిపై ఏ. రంగంపేట సర్పంచ్ ఎర్రయ్య మాట్లాడుతూ.. మంచు మనోజ్ పై మండిపడ్డారు. ఎర్రయ్య మాట్లాడుతూ..”మోహన్ బాబును నమ్ముకొని వేలమంది జీవనోపాధి పొందుతున్నారు. ఇక్కడ భూముల ధరలు పెరగడానికి కూడా మోహన్ బాబే కారణం. ముఖ్యంగా స్థానికులకు ఏ సమస్య వచ్చినా సరే మేము మోహన్ బాబును సంప్రదిస్తాము. ఇక బయట నుంచి వచ్చిన చాలామంది హోస్టల్స్ పెట్టుకొని బ్రతుకుతున్నారు. ఇప్పుడు మీరు వచ్చి గొడవ చేసి, మా కడుపు కొట్టవద్దు” అంటూ సర్పంచ్ ఎర్రయ్య మనోజ్ కి వార్నింగ్ ఇస్తూ కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
గత ఏడాది నుంచే గొడవలు..
ఇకపోతే గత ఏడాది నుంచే ఈ కుటుంబంలో గొడవలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఎప్పుడైతే అటు మంచు మనోజ్ తనపై దాడి చేశారని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారో.. అప్పుడే అసలు విషయం బయటకు వచ్చింది. అటు మోహన్ బాబు కూడా తన కొడుకు మంచు మనోజ్, కోడలు మౌనిక నుంచి ప్రాణహాని ఉందని, పోలీస్ స్టేషన్లో పరస్పర కంప్లైంట్లు ఇచ్చుకోవడం సంచలనంగా మారింది. దీనికి తోడు జల్పల్లిలో ఉన్న మోహన్ బాబు ఫామ్ హౌస్ వద్ద మంచు మనోజ్ 30 మంది బౌన్సర్లను, మంచు విష్ణు 40 మంది బౌన్సర్లను రంగంలోకి దింపడం, దీనికి తోడు మోహన్ బాబు ఇంట్లోకి మనోజ్ బౌన్సర్లకు అనుమతిని పోలీసులు నిరాకరించడం, ఆ తర్వాత మంచు మనోజ్ డీజీపీని కలవడం ఇలా అన్నీ జరిగిపోయాయి. ఇక ఆ తర్వాత మీడియా మిత్రులపై మోహన్ బాబు దాడి చేయడంతో.. కేస్ ఫైల్ అయ్యి.. ఆయన కోర్టు వరకు కూడా వెళ్లి వచ్చారు.