Prabhas: టాలీవుడ్ ఫ్యాన్స్ కి మే 20 అంటే ఒక పండుగ. ఎందుకంటే ఆ రోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆ రోజున సోషల్ మీడియా లో ట్రెండ్స్, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, ఫ్లెక్సీలు, స్పెషల్ షోలు – ఇలా విపరీతమైన సెలబ్రేషన్స్ చేస్తుంటారు. కానీ ఈసారి మాత్రం ఈ సెలబ్రేషన్ కి మాస్, మైండ్, మ్యాజిక్ అన్నీ కలిపిన స్పెషల్ టచ్ ఉంది. 2007లో విడుదలైన యమదొంగ చిత్రం ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన కాంప్లీట్ మాస్ ఎనర్జీ బ్లాస్టర్. అప్పట్లోనే హై వీఎఫ్ఎక్స్, ఫాంటసీ థీమ్, మాస్ ఎలిమెంట్స్ అన్నీ కలిపి టాలీవుడ్ లో ఓ రేంజ్ క్రియేట్ చేసిన సినిమా. ఇప్పుడు ఈ సినిమాని మళ్ళీ థియేటర్స్ లో చూడడం అంటే ఫ్యాన్స్ కు ఒక నోస్టాల్జియా రైడ్ మాత్రమే కాదు, వాళ్ళ హీరో ఎనర్జీని మళ్లీ ఫీల్ అవ్వడం.
ఇక్కడే వస్తుంది అసలు ట్విస్ట్. యమదొంగ టైటిల్స్ లో రాజమౌళి సొంత బ్యానర్ “విశ్వామిత్ర క్రియేషన్స్” లోగో వస్తుంది. ఆ లోగో కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఒక విజువల్‌లో ప్రభాస్ ‘విశ్వామిత్ర మహర్షిగా’ కనిపిస్తారు. ఇది ప్రభాస్ కెరీర్ లో ఇప్పటివరకు కనిపించని ఓ రేర్ లుక్! ఈ వర్షన్ లో ప్రభాస్ కనిపించే ఈ స్పెషల్ ఇంట్రో కేవలం కొన్ని సెకండ్లు అయినా, ప్రభాస్ ఫ్యాన్స్ లో మాస్ కిక్ ఎలా తీసుకొస్తుందో ఊహించండి. ఇప్పటికే సోషల్ మీడియాలో “విశ్వామిత్ర ప్రభాస్” లుక్ మీదుగా భారీ అంచనాలు మొదలయ్యాయి.
ఈ రీ-రిలీజ్ తో NTR ఫ్యాన్స్ – ప్రభాస్ ఫ్యాన్స్ ఒకే థియేటర్ లో కలసి సినిమా చూసే మాసివ్ మోమెంట్ కన్‌ఫర్మ్. యమదొంగ టైటిల్స్ స్టార్ట్ అయ్యే టైమ్ నుంచే థియేటర్లలో హంగామా మొదలవుతుంది.
ఈ కలయిక దెబ్బకి రీరిలీజ్ సినిమాల రికార్డ్స్ మిగలకపోవచ్చు!
ఇద్దరు స్టార్ హీరోల అభిమానులు ఒకేసారి పండగ చేసుకోవడం చాలా అరుదు, అలాంటి అవకాశాన్ని ఇచ్చింది యమదొంగ సినిమా. ఇక రేపటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ దగ్గర సినీ అభిమానులు “రాముడు, భీముడు” కలిసి వచ్చినట్టే ఫీలవుతారు. ఇది సినిమా కాకుండా ఒక కల్చరల్ మువ్మెంట్ అనిపించేలా ఉంది. సింపుల్ గా చెప్పాలంటే… మే 18,19, 20ల్లో బాక్సాఫీస్ దగ్గర రీరిలీజ్ సినిమాల్లో మాస్ హిస్టరీ చూడబోతున్నాం.