BigTV English

Love Reddy: థియేటర్లో నటుడిపై మహిళ దాడి..ఇంత వైలెంట్ ఏంటి భయ్యా..

Love Reddy: థియేటర్లో నటుడిపై మహిళ దాడి..ఇంత వైలెంట్ ఏంటి భయ్యా..

Love Reddy : సినిమాలకు జనాలు కనెక్ట్ అవుతారు అంటే ఏమో అనుకున్నాం.. కానీ ఈ మధ్య జరుగుతున్న కొన్ని సంఘటలను చూస్తే అది నిజం అనే నమ్మాలి.. ప్రేక్షకుల ఆనందం కోసం, జనాల్లో ఆలోచనలను ప్రేరేపించడానికి కొత్త ప్రయోగాలు చేస్తారు. కానీ కొన్ని సార్లు ఆ ప్రయోగాలకు జనాలు ఎక్కువగా కనెక్ట్ అవ్వడంతో సీన్ రివర్స్ అవుతుంది. ఇప్పుడు ఈ సోది అంతా ఎందుకు చెప్తున్నారు అనుకుంటున్నారు కదా.. అందుకు ఒక కారణం ఉంది.. తాజాగా సినిమాకు ఓవర్ కనెక్ట్ అయిన మహిళ థియేటర్లలో జనాల రెస్పాన్స్ ను చూడటానికి అక్కడకు వచ్చిన సినిమా టీమ్ పై దాడి చేసింది. తనకు కోపం తెప్పించిన నటుడిపై రివంజ్ ఓ రెంజులో తీర్చుకుంది. అందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


అసలు విషయానికొస్తే.. హైదరాబాద్ లో సినిమా రెస్పాన్స్ ఉందని థియేటర్స్ విజిట్ కు వెళ్లిన “లవ్ రెడ్డి” చిత్రబృందం లోని నటుడిపై ఓ ప్రేక్షకురాలు దాడికి పాల్పడిన ఘటన హైదరాబాద్ నిజాంపేట జీపీఆర్ మాల్ మల్టీప్లెక్స్ లో చోటు చేసుకుంది. ఈ సినిమా క్లైమాక్స్ చూసి ఎమోషనల్ అయిన ఆ ప్రేక్షకురాలు తండ్రి పాత్రను పోషించిన ఎన్ టీ రామస్వామి అనే నటుడు ప్రేమ జంటను నిజంగానే విడదీసి, వాళ్ళను ఏడిపించడం తట్టుకోలేక పోయిన మహిళ అది నిజమే అనుకోని బూతులు తిడుతూ అతని పై తన కక్ష్యను తీర్చుకుంది. ఆమె ఆవేశం చూసి అక్కడ వాళ్లంతా ముక్కున వేలేసుకున్నారు.

ఈ దాడి సంఘటన తో ఆశ్చర్యపోయిన హీరో అంజన్ రామచంద్ర, హీరోయిన్ శ్రావణి, దర్శకుడు స్మరణ్ రెడ్డి, ఇతర టీమ్ మెంబర్స్ ఆ మహిళను అడ్డుకుని ఆమెకు నచ్చజెప్పారు. కన్నడ సినీ పరిశ్రమకు ఎన్ టీ రామస్వామి తండ్రి పాత్రలో నటించాడని, అతను సినిమాలో చూపించినట్లు చెడ్డవాడు కాదని మహిళకు చెప్పి అక్కడి నుంచి పంపించివేశారు. ఈ నెల 18న థియేటర్స్ లోకి వచ్చిన “లవ్ రెడ్డి” సినిమాకు ప్రేక్షకుల నుంచి సూపర్ హిట్ టాక్ వచ్చింది.. ఎమోషనల్ ప్రేమ కథతో ఈ సినిమాను రూపొందించారు. అంత ఎమోషనల్ గా కథ ఉంటే ఇలాంటివి తప్పవు అని ఈ ఘటనే సాక్ష్యం.. సో థియేటర్లకు వెళ్లే మూవీ టీమ్ కు ఇది ఒక అలెర్ట్ అయ్యింది. మొత్తానికి ఈ ఘటనతో సినీ ఇండస్ట్రీ కూడా షాక్ అయ్యింది. ప్రజెంట్ ఈ దాడి ఘటనకు సంబందించిన ఫోటోలు వీడియో లు సోషల్ మీడియాలో హాట్ అవుతున్నాయి.


Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×