BigTV English

Woman Health: రుతుస్రావానికి, స్పాటింగ్‌కు మధ్య తేడా ఏంటో తెలుసుకోండి, స్పాటింగ్‌ను అలా అనుకోవద్దు

Woman Health: రుతుస్రావానికి, స్పాటింగ్‌కు మధ్య తేడా ఏంటో తెలుసుకోండి, స్పాటింగ్‌ను అలా అనుకోవద్దు

మహిళల్లో స్పాటింగ్, రుతుస్రావం ఈ రెండూ జరుగుతూనే ఉంటాయి. పన్నేండేళ్ల ఆడపిల్లల్లోరుతుస్రావం రావడానికి కొన్ని రోజుల ముందు లేదా నెలల ముందు స్పాటింగ్ కనిపిస్తుంది. అలా స్పాటింగ్ కనిపించిందంటే కొన్ని రోజుల్లో వారికి పీరియడ్స్ మొదలవుతాయని అర్థం చేసుకోవాలి. అలాగే మహిళల్లో కూడా ప్రతి నెలా రుతుస్రావం వస్తున్నప్పటికీ అప్పుడప్పుడు స్పాటింగ్ కనిపిస్తూ ఉంటుంది. ఈ స్పాటింగ్ అనేది లైట్ కలర్ లో ఉంటుంది. దాన్ని కూడా రుతుస్రావం అనుకుంటారు. ఎంతోమంది కొన్ని చుక్కలు మాత్రమే స్రవించి స్పాటింగ్ ఆగిపోతుంది. కాబట్టి ప్రతి మహిళా స్పాటింగ్ కు, రుతుస్రావంకు మధ్య తేడాను తెలుసుకోవాలి.


స్పాటింగ్ అంటే
స్పాటింగ్ అంటే రుతుస్రావం మొదలవడానికి ముందు కనిపించే లక్షణం. రక్తం కొన్ని చుక్కలు మేరకు కనిపిస్తుంది. తర్వాత ఆగిపోతుంది. దీన్ని యోని రక్తస్రావం అని కూడా పిలుచుకోవచ్చు. స్పాటింగ్ అనేది సాధారణ రుతుస్రావంతో పోలిస్తే చాలా తేలికగా ఉంటుంది. అంటే ఒక్కసారి మాత్రమే రెండు మూడు చుక్కల రూపంలో కనిపించి మాయమైపోతుంది. అప్పుడు స్రవించే రక్తం గులాబీ రంగులో లేదా గోధుమ రంగులో కూడా ఉండవచ్చు. ప్యాడ్స్ పెట్టుకోవాల్సిన అవసరం స్పాటింగ్ లో కనిపించదు. స్పాటింగ్ కనిపించినప్పుడు రొమ్ములు సున్నితంగా మారుతాయి. పొట్ట కూడా నొప్పిగా, అసౌకర్యంగా అనిపించవచ్చు.

గర్భంలో స్పాటింగ్
ప్రెగ్నెన్సీ లో కూడా స్పాటింగ్ కనిపించే అవకాశం ఉంది. దాన్ని రుతుస్రావంగా భావించి భయపడేవారు. ఎక్కువమంది ఇది లేత గులాబీ రంగులో అవుతూ ఉంటుంది. ఒక్కోసారి ప్రకాశవంతమైన ముదురు రంగులో కూడా ఈ రక్తం కనిపిస్తుంది. గర్భం ధరించిన సమయంలో ఏ నెలలో అయినా స్పాటింగ్ కనిపించే అవకాశం ఉంది. అయితే ఎక్కువ కాలం పాటు ఇది జరగదు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు.


గర్భం ధరించిన తొలి రోజుల్లో కూడా కొంతమందికి స్పాటింగ్ కనిపిస్తూ ఉంటుంది. అండం ఫలదీకరణం చెందాక అది గర్భాశయ గోడకు అతుక్కునేందుకు ప్రయత్నిస్తుంది. ఆ సమయంలోనే స్పాటింగ్ కనిపించే అవకాశం ఉందని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

పాలీసిస్టరీ ఓవరీ సిండ్రోమ్ అనే హార్మోన్ల సమస్యతో బాధపడే మహిళల్లో కూడా స్పాటింగ్ కనిపించే అవకాశం ఉంది. వీరికి సక్రమంగా పీరియడ్స్ రావు. దీనివల్ల కూడా అప్పుడప్పుడు స్పాటింగ్ కనిపిస్తుంది.

పెరిమెనోపాజ్
పెరిమెనోపాజ్ అంటే మెనోపాజ్ కు ముందు దశ. మీ శరీరం రుతుస్రావంను పూర్తిగా ఆపేయడానికి సిద్ధపడుతూ ఉంటుంది. అదే పెరీమెనోపాజ్ అందుకే ఈ దశలోనే అప్పుడప్పుడు స్పాటింగ్ కనిపిస్తూ ఉంటుంది.

Also Read: దీపావళి రోజు కొత్తగా కనిపించాలా ? ఈ టిప్స్ ఫాలో అయిపోండి

పీరియడ్స్ అంటే
ఇక పీరియడ్స్ విషయానికి వస్తే ప్రతి నెలా ఆరోగ్యకరమైన మహిళల్లో రుతుస్రావం జరుగుతూనే ఉంటుంది. ఇది కేవలం స్పాటింగ్ లాగా అలా కనిపించి మాయమైపోదు. రెండు నుంచి వారం పాటు రక్తస్రావం కనిపిస్తుంది. అలాగే కడుపు ఉబ్బరంగా అనిపించడం, రొమ్ములు సున్నితంగా మారడం, మూడు స్వింగ్స్ రావడం, తీవ్రంగా అలసిపోయినట్టు అనిపించడం, తలనొప్పి, జీర్ణ సమస్యలు వంటివి పీరియడ్స్ టైం లో కనిపిస్తాయి.

Related News

Shocking Facts: రాత్రి 7 తర్వాత భోజనం చేస్తారా? మీ ఆరోగ్యానికి షాక్ ఇచ్చే నిజాలు!

Heart Problems: రాత్రిపూట తరచూ గురక.. నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన 5 ఆరోగ్య సమస్యలు

Thyroid Disease: థైరాయిడ్ ఉన్న వారు.. పొరపాటున కూడా ఇవి తినొద్దు !

Easy Egg Recipes: ఎగ్స్‌తో తక్కువ టైంలో.. సింపుల్‌గా చేసే బెస్ట్ రెసిపీస్ ఇవే !

Dondakaya Fry: పక్కా ఆంధ్రా స్టైల్ దొండకాయ ఫ్రై.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్

Health tips: గుండెల మీద ఎవరైనా కూర్చొన్నట్లు అనిపిస్తోందా? దానిని ఏమంటారో తెలుసా?

Navratri Fasting: నవరాత్రి ఉపవాస సమయంలో.. ఈ ఫుడ్ తింటే ఫుల్ ఎనర్జీ !

Fast Eating: టైం లేదని వేగంగా తింటున్నారా ? ఎంత ప్రమాదమో తెలిస్తే ఈ రోజే మానేస్తారు !

Big Stories

×