Aaditi Pohankar: మామూలుగా రొమాంటిక్ సీన్స్‌లో నటించడం హీరోయిన్లకు ఎంత ఇబ్బందిగా ఉంటుందో హీరోలకు కూడా అంతే ఇబ్బందిగా ఉంటుంది. కానీ ప్రేక్షకుల అభిప్రాయం మాత్రం వేరేలా ఉంటుంది. హీరో, హీరోయిన్లు సౌకర్యంగా అనిపిస్తేనే ఇలాంటి సీన్స్ చేస్తుంటారని చాలామంది అనుకుంటారు. కానీ ప్రతీసారి పరిస్థితి అలా ఉండకపోవచ్చు. ఇంటిమేట్ సీన్స్ చేయడానికి ఇష్టపడకపోయినా కూడా చేయాల్సిన సందర్భాలు వస్తాయి. అలాంటి వాటిపై నటీనటులు.. ముఖ్యంగా హీరోయిన్స్ మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ ఒక యంగ్ బ్యూటీ మాత్రం తాజాగా ఓ బాలీవుడ్ సీనియర్ హీరోతో రొమాంటిక్ సీన్స్ చేసి దాని ఎక్స్‌పీరియన్స్ గురించి బయటపెట్టింది.
నమ్మకం ఉండాలి
హిందీ, తమిళ సినిమాల్లో మాత్రమే కాకుండా పలు వెబ్ సిరీస్‌లలో కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న యంగ్ బ్యూటీ అదితి పోహంకర్. ముఖ్యంగా హిందీలో తను ‘షీ’, ‘ఆశ్రమ్’ లాంటి వెబ్ సిరీస్‌ల్లో నటించి మంచి ఆదరణ సంపాదించుకుంది. ఈ రెండిటిలో ఇంటిమేట్ సీన్స్‌లో కనిపించింది అదితి. దానిపై తను తాజాగా స్పందించింది. అలాంటి సీన్స్‌లో నటించడానికి కో యాక్టర్స్ సపోర్టే చాలా అవసరం అంటోంది ఈ ముద్దుగుమ్మ. పైగా అలా నటించడానికి ఒకరితో ఒకరికి కంఫర్ట్ మాత్రమే కాదు.. ఒకరిపై ఒకరికి నమ్మకం కూడా ఉండాలని చెప్పింది అదితి పోహంకర్.
మగవాళ్లే భయపడతారు
‘‘ఇంటిమేట్ సీన్స్ అనేవి ఎంతైనా కష్టమే. ఎందుకంటే అవి చేయాలంటే ఇద్దరు యాక్టర్స్ కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వాలి. ఇలాంటి సీన్స్‌లో మగవాళ్లే ఎక్కువగా భయపడతారు అని ఇంతియాజ్ అలీ నాకు ఒకసారి చెప్పారు. కాబట్టి మన యాక్టర్ సౌకర్యంగా ఫీల్ అయ్యే బాధ్యత కూడా మనమే తీసుకోవాలి. షీ వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో సెట్‌లో చాలామంది అమ్మాయిలు ఉన్నారు. వారి కంఫర్ట్ గురించి కూడా నేను ఆలోచించాల్సి వచ్చింది’’ అని గుర్తుచేసుకుంది అదితి పోహంకర్.
Also Read: నాకు ఇండస్ట్రీలో గర్ల్‌ఫ్రెండ్ లేదు.. వారిపై బాలీవుడ్ యంగ్ హీరో సెటైర్లు
కట్ చెప్పినా అంతే
‘‘ఏమైనా సమస్య? మీరు ఓకేనా? అని అడిగి వాళ్లు సేఫ్‌గా ఫీల్ అయ్యేలా చేయాలి. అలాగే షీలో మాత్రమే కాదు.. ఆశ్రమ్‌లో కూడా ఇంటిమేట్ సీన్స్ చేయగలిగాము. ఆశ్రమ్ సమయంలో మా బాండ్ చాలా స్ట్రాంగ్ ఉంది. ఒకవేళ సీన్ మధ్యలో కట్ చెప్పినా మేము కదలకుండా అలాగే ఉండి ఇద్దరం ఓకేనా కాదా అని కన్ఫర్మ్ చేసుకున్నాం. నటీనటుల మధ్య ఎక్కువ దూరం ఉంటే అది స్క్రీన్‌పై అస్సలు బాగా కనిపించదు. అందుకే ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. రాపో ఉండాలి. నేచురల్‌గా కనిపించడంలోనే ఇంటిమసీ సీన్స్‌లోని అందం కనిపిస్తుంది. నటీనటుల మధ్య హద్దులు ఉండడం కూడా ముఖ్యమే’’ అని చెప్పుకొచ్చింది అదితి పోహంకర్ (Aaditi Pohankar).
అలా మొదలయ్యింది
‘‘ఒకరిని చూసి మరొకరు భయపడకూడదు. నమ్మకం ఉంటే అన్నీ ఫ్లోలో జరిగిపోతాయి. ముందుగా బాబీ డియోల్‌తో నాకు ఫ్రెండ్‌షిప్ ఎలా ఏర్పడిందంటే ఆయన లంచ్ నేను తినేశాను. ఆయన అడిగినప్పుడు నేను తిన్నానని చెప్పాను. అందుకే తర్వాతి రోజు ఆయన కోసం నేను లంచ్ తీసుకెళ్లాను. ఆయనకు అది కారంగా అనిపించింది అని చెప్పారు. అలా మా మధ్యలో కంఫర్ట్ ఏర్పడింది’’ అని బయటపెట్టింది అదితి పోహంకర్.