E-Paper
Advertisement

Aamani: నా భర్త ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.. విడాకులు ఎందుకు ఇచ్చాను అంటే..?

Aamani: నా భర్త ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.. విడాకులు ఎందుకు ఇచ్చాను అంటే..?
Advertisement

Aamani:సీనియర్ నటి ఆమని గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జంబలకిడి పంబ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆమని మొదటి సినిమాతోనే హిట్ అందుకొని టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా మారింది. కృష్ణ, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, జగపతి బాబు, కమల్ హాసన్.. ఇలా స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే. నిర్మాత ఖాజా మొయిద్దీన్ ను మతాంతర వివాహం చేసుకొని సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఆ తరువాత ఆమె సినిమాల్లో కనిపించలేదు.

ఇక 2003లో రాంగోపాల్ వర్మ చిత్రం మధ్యాహ్నం హత్యతో ఈమె తిరిగి సినీ రంగప్రవేశం చేసింది. ఇక అప్పటినుంచి ఆమె రీఎంట్రీలో కూడా అదరగొడుతుంది. కుర్ర హీరోలకు తల్లిగా, అత్తగా, అక్కగా నటిస్తూ మంచి పేరునే సంపాదించుకుంది. ఆమని జీవితంలో చాలామందికి తెలియని కొన్ని విషయాలు జరిగాయి. ఆమె తన భర్తకు విడాకులు ఇచ్చింది. నిర్మాత అయిన ఖాజా మొయిద్దీన్ ఒకానొక సమయంలో ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. అది అప్పట్లో సంచలనంగా మారింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ ప్రశ్నలన్నింటికీ ఆమె సమాధానం ఇచ్చింది. తన భర్త సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించినట్లు ఆమె చెప్పుకొచ్చింది.

Advertisement

” మా ఇద్దరి మధ్య పెద్ద గొడవలు అనేవి ఏమి లేవు. ఆయన ఒక సినిమా తీసి బాగా నష్టపోయారు. కోట్లలో డబ్బులు కట్టాలి. ఆ ప్రెషర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో నాకు ఆయనకు ఏం చెప్పాలో అర్ధం కాలేదు. అంతా సర్దుకుంటుంది అని చెప్పాను అంతే. ఇక ఆ ఘటన తరువాత రియల్ ఎస్టేట్ లో దిగి ఆయనే ఆ డబ్బు మొత్తాన్ని కట్టేశారు. ఇప్పుడు కోట్లు అంటే కామన్ .. అప్పట్లో కోట్లు ఆంటే మాములు విషయం కాదు. దానివలన మా ఇద్దరి మధ్య విడాకులు కాలేదు. ఫ్రెండ్లీగా విడిపోయాం. విడిగా ఉండాలనుకున్నాం.. విడిగా ఉంటున్నాం. నేను సినిమాల్లో మళ్లీ రావడం ఆయనకు ఇష్టం లేదు. నేను వస్తాను అని చెప్పి వచ్చేశాను. ఇప్పుడు నాకు రెండే ప్రపంచాలు. ఒకటి సినిమా.. ఇంకొకటి నా పిల్లలు” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమని ఇంటర్వ్యూ నెట్టింట వైరల్ గా మారింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×