Aamir khan : చెన్నైకి మకాం మార్చిన అమీర్ ఖాన్.. కారణం అదేనా?

Aamir khan : చెన్నైకి మకాం మార్చిన అమీర్ ఖాన్.. కారణం అదేనా?

Aamir khan
Share this post with your friends

Aamir khan

Aamir khan : అమీర్ ఖాన్.. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరు తెచ్చుకున్న స్టార్ హీరో. ఇప్పుడైతే కాస్త జోరు తగ్గింది కానీ.. ఒకప్పుడు అమీర్ ఖాన్ మూవీ అంటే సెంట్ పెర్సెంట్ హిట్ కొట్టాల్సిందే అన్నట్లు ఉండేది పరిస్థితి. కథ సెలెక్ట్ చేయడం దగ్గర నుంచి యాక్టింగ్ వరకు.. లుక్స్ దగ్గర నుంచి లొకేషన్ వరకు.. ప్రతి విషయం ఆచితూచి డెసిషన్ తీసుకునే ఒకే ఒక హీరో అమీర్ ఖాన్. బాలీవుడ్ ఖాన్ త్రయం లో అమీర్ ఖాన్ ఒకరు. బాలీవుడ్ లో బాగా సెటిల్ అయిన ఈ స్టార్ హీరో ప్రస్తుతం తన మకాం చెన్నైకి మార్చాడు.

మామూలుగా ఏదైనా సినిమాని ఒప్పుకుంటే ఆ సినిమాకు సంబంధించి పూర్తి గ్రౌండ్ వర్క్ చేసే అలవాటు ఉన్న అమీర్ ఇప్పుడు సడన్గా చెన్నైకి మకాం మార్చడం పై పలు రకాల సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం అమీర్ ఖాన్ ఏదో తమిళ్ మూవీ లో చేయడానికి ఒప్పుకున్నారని అందుకోసమే ప్రత్యేకంగా చెన్నైకి మకాం మార్చారని పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే అమీర్ ఖాన్ ముంబైలో కాకుండా సడన్గా చెన్నైకి ఎందుకు వచ్చారు అనే విషయం ప్రస్తుతం టాలీవుడ్ లో ,కోలీవుడ్ లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

ఇంతకీ విషయం ఏమిటి అని ఆరా తీస్తే అసలు సంగతి బయటికి వచ్చింది. అమీర్ ఖాన్ చెన్నై రావడానికి వెనుక ఎటువంటి సినిమా రిలేటెడ్ కారణం లేదు. బయట ప్రచారం జరుగుతున్నట్టు అతని ఏ మూవీ కోసం చెన్నైకి రాలేదు. కేవలం తన సొంత ఫ్యామిలీ ఇష్యూ మీద చెన్నైకి వచ్చి రెండు నెలలపాటు హోటల్లో ఉండడానికి అమీర్ ఖాన్ నిర్ణయం తీసుకున్నారు. అంతేకానీ అందరూ అనుకుంటున్నట్టుగా ఏదో మూవీలో నటించడానికో.. లేక మూవీకి ముందు ప్రాక్టీస్ తీసుకోవడానికి కానే కాదు.

అసలు సంగతి ఏమిటంటే.. అమీర్ ఖాన్ తల్లి జీనత్ హుస్సేన్ అనారోగ్యంతో బాధపడుతున్నారట. చికిత్స నిమిత్తం ఆమెను చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జాయిన్ చేశారు. దగ్గర ఉండి తల్లిని చూసుకోవాలి అనే ఉద్దేశంతో అమీర్ ఖాన్ రెండు నెలల పాటు చెన్నైలోనే ఉండడానికి నిర్ణయం తీసుకున్నారు. అందుకే అతని తల్లి చికిత్స పొందుతున్న ఆసుపత్రి దగ్గరలో ఉండే విధంగా ఒక హోటల్లో ఉండడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక ఇది పూర్తి అయిన వెంటనే అమీర్ ఖాన్ ఇంట్లో పెళ్లి భాజలు మోగుతాయి.

అమీర్ ఖాన్ మొదటి భార్య రీనా కు విడాకులు ఇచ్చి కిరణ్ రావుని వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. రీనా కూతురు ఐరా ఖాన్‌ త్వరలో పెళ్లికూతురు కాబోతోంది. రీసెంట్గా ఆమె పెళ్లికి సంబంధించిన డేట్ ని కూడా అమీర్ అనౌన్స్ చేశారు. వచ్చే సంవత్సరం జనవరి 3 వ తారీకున అమీర్ ఖాన్ తన కూతురు పెళ్లి చేయబోతున్నాడు. ప్రస్తుతం అతను ఈ రెండు పనులు పూర్తి చేసిన తర్వాతే తన తదుపరి చిత్రం సితారే జమీన్ పర్ మూవీ ను స్టార్ట్ చేస్తాడట. ఈ మూవీ ఒక్కప్పటి అమీర్ ఖాన్ బ్లాక్ బస్టర్ చిత్రం తారే జమీన్ పర్ కు రివర్స్ లో ఉంటుందని తెలుస్తోంది. ఇందులో బొమ్మరిల్లు హాసిని.. జెనీలియా హీరోయిన్ గా నటిస్తుంది.మరి ఈ మూవీ తో అమీర్ ఎటువంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Sushant Singh Rajput : అమ్మకానికి సుశాంత్ సింగ్ ఇల్లు.. భారీ ధరకు కొననున్న తెలుగు హీరోయిన్

Bigtv Digital

Victory Venkatesh : సెంటిమెంట్ ఫాలో అవుతున్న వెంకీ డైరెక్ట‌ర్‌

Bigtv Digital

Mahesh Babu:- మహేశ్ ఇక దుబాయ్‌లోనే ఉండబోతున్నాడా? దుబాయ్ కాస్ట్లీ విల్లా

Bigtv Digital

Naga Chaitanya: కమర్షియల్ హిట్ కోసం కుస్తీలు పడుతున్న నాగచైతన్య…

Bigtv Digital

Anasuya: బికినీలో అనసూయ.. భరద్వాజ్‌కు లిప్ టు లిప్ కిస్..

Bigtv Digital

Leave a Comment