BigTV English

Jubilee hills crime : జూబ్లిహిల్స్ అత్యాచారం కేసు.. మురళీముకుంద్ అరెస్ట్

Jubilee hills crime : జూబ్లిహిల్స్ అత్యాచారం కేసు.. మురళీముకుంద్ అరెస్ట్

Jubilee hills crime : జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ మాజీ ఛైర్మన్‌తోపాటు ఆయన కొడుకు ఆకాష్‌పై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. దళిత యువతిపై దాడి చేసిన ఘటనలో వీరిద్దరిపై కేసు నమోదు చేశారు. పనిమనిషిపై అత్యాచారానికి పాల్పడిన మురళీ ముకుంద్‌పై పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. అత్యాచారానికి గురైనప్పటి నుంచి బాధితురాలిని భరోసా సెంటర్‌లోనే ఉంచారు.


కాగా.. తాజాగా మురళీముకుంద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను నాంపల్లి జడ్జి ఇంటికి తీసుకెళ్లి.. హాజరుపరిచారు. జడ్జి మురళీముకుంద్ కు రిమాండ్ విధించారు. మురళీ ముకుంద్ సెల్ ఫోన్, పాస్ పోర్ట్ ను సీజ్ చేశారు. మురళీముకుంద్ కొడుకు ఆకాష్ పరారీలో ఉండటంతో.. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఏడాది జూన్ లో బాధిత యువతి మురళీముకుంద్ ఇంటిలో పనికోసం చేరింది. పనిలో చేరిన 15 రోజుల తర్వాత తనకు వేధింపులు మొదలయ్యాయని పోలీసులకు వివరించింది. లైంగిక దాడి చేయడమే కాకుండా.. శారీరకంగా హింసించారని యువతి వాపోయింది.


Tags

Related News

Jammu Kashmir: భారీ వర్షాలు.. విరిగిపడిన కొండచరియలు, స్పాట్‌లో ఐదుగురు మృతి

Crime: భార్యలను చంపుతున్న భర్తలు.. అసలు కథ ఇదే..!

Anantapur News: అనంతలో ట్రయాంగిల్‌ లవ్‌‌.. ప్రియురాలి బెదిరింపులు, మరో యువతి సూసైడ్

Medipally News: కాళ్లు, చేతులు, తల లేకుండానే స్వాతి అంత్యక్రియలు..

Hyderabad News: నడిరోడ్డుపై రెచ్చిపోయారు.. క్రికెట్ బ్యాట్‌తో బైకర్స్‌పై దాడి చేసి, మేటరేంటి?

Mahabubnagar Incident: రెబీస్ భయం.. కూతురిని చంపి, తల్లి ఆత్మహత్య.. బోర్డు మీద రాసి మరీ..

Big Stories

×