BigTV English

Abinaya:ఎట్టకేలకు ప్రియుడు గురించి చెప్పేసిన నటి అభినయ..!

Abinaya:ఎట్టకేలకు ప్రియుడు గురించి చెప్పేసిన నటి అభినయ..!

Abinaya:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి రవితేజ (Raviteja ) నటించిన ‘నేనింతే’ సినిమాతో నటిగా ఇండస్ట్రీకి పరిచయమైంది అభినయ (Abhinaya). ఆ తర్వాత మళ్లీ రవితేజ హీరోగా నటించిన ‘శంభో శివ శంభో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ఈ సినిమా తర్వాత ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో ప్రేక్షకులను మరోసారి మెప్పించింది. వెంకటేష్ (Venkatesh), మహేష్ బాబు(Maheshbabu ) చెల్లిగా అందరిని అబ్బురపరిచింది. ఆ తర్వాత రామ్ చరణ్ (Ram Charan) ‘ధ్రువ’ సినిమాలో డాక్టర్ అక్షర పాత్రలో అవకాశాన్ని దక్కించుకున్న ఈమె.. ఎన్టీఆర్(NTR )హీరోగా నటించిన ‘దమ్ము’ సినిమాలో ఎన్టీఆర్ కి చెల్లిగా నటించింది. ఇలా పలువురు స్టార్ హీరోల సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న అభినయ.. తాజాగా తన పెళ్లిపై స్పందించింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.


బాయ్ ఫ్రెండ్ గురించి రివీల్ చేసిన అభినయ..

ప్రముఖ నటి అభినయ, కోలీవుడ్ స్టార్ హీరో విశాల్(Vishal ) తో ప్రేమలో ఉన్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రేమ, పెళ్లి అంటూ వస్తున్న రూమర్స్ పై తాజాగా స్పందించింది. ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేసింది. పుట్టుకతోనే దివ్యాంగురాలైన (మూగ, చెవిటి) అభినయ, తన సైన్ లాంగ్వేజ్ తో పలు విషయాలను పంచుకుంది. రీసెంట్ గా ఈమె కీలకపాత్ర పోషించిన మలయాళ చిత్రం పని (Pani). ప్రముఖ నటుడు ‘జోజూ జార్జ్ ‘ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అటు ఓటిటిలో కూడా అదరగొట్టేస్తోంది. అయితే ఈ సినిమాలో ఆమెపై చిత్రీకరించిన అత్యాచార సన్నివేశం మాత్రం వివాదాస్పదంగా మారింది. దీంతో జోజూ జార్జ్ మేకింగ్ ను చాలా మంది తప్పుబడుతూ కామెంట్లు చేశారు. ఇక ఈ విషయంపై కూడా అభినయ స్పందించింది. మొదట విశాల్ తో ప్రేమా, పెళ్లి గురించి మాట్లాడుతూ.. “నేను 15 ఏళ్లుగా కలిసి చదువుకున్న స్నేహితుడిని ప్రేమిస్తున్నాను. త్వరలోనే అతడిని వివాహం చేసుకోబోతున్నాను” అంటూ ప్రకటించి , అందరినీ ఆశ్చర్యపరిచింది. 33 ఏళ్ల అభినయకు ఇంకా పెళ్లి కాలేదు. ఆ ఇంటర్వ్యూలో.. మీరు ఒంటరిగా ఉన్నారా? ఎవరితోనైనా డేటింగ్ చేస్తున్నారా? అని ప్రశ్నించడంతో ఖంగుతిన్న ఈమె ఏమాత్రం తడబడకుండా అసలు విషయాన్ని బయటపెట్టి విశాల్ తో వస్తున్న ప్రేమ, పెళ్లి రూమర్స్ కి అడ్డుకట్ట వేసింది. మొత్తానికైతే ఈ ముద్దుగుమ్మ త్వరలో తన బాయ్ ఫ్రెండ్ తో ఏడడుగులు వేయబోతోంది అని చెప్పకనే చెప్పిందని చెప్పవచ్చు. కానీ తన బాయ్ ఫ్రెండ్ పూర్తి వివరాలు మాత్రం తెలుపలేదు.


దర్శకుడి మాటే తుది నిర్ణయం..

అలాగే పని సినిమాలో అభ్యంతరకర సన్నివేశంపై కూడా మాట్లాడుతూ.. ఒక ప్రాజెక్టు పూర్తి కావాలి అంటే, అందులో దర్శకుడి పాత్ర ఎంతో ఎక్కువ ఉంటుంది. ఆయన మాటే తుది నిర్ణయం గా భావించాలి. సౌత్ ఇండియాలో జోజూ చాలా గొప్ప నటుడు. గొప్ప గొప్ప దర్శకులతో కూడా ఆయన పనిచేశారు. మంచి అనుభవం ఉన్న నటుడే కాదు సినిమా మేకర్ కూడా. అలాంటి ఈయన చిత్రీకరించిన సినిమా పని.. అందులోని సన్నివేశాలను తప్పు పట్టడం ఏమాత్రం కరెక్ట్ కాదు అంటూ అభినయ తెలిపింది. ఇక ప్రస్తుతం అభినయ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Related News

Nainika Anasuru : మా నాన్న అలాంటివాడు, అందుకే ఎక్కువ చెప్పను

Nainika Anasuru : నా ఫోటో పెట్టి రేట్ చెప్పే వాళ్ళు, నాకు కూతురు ఉంటే ఇండస్ట్రీకి పంపను

Nainika Anasuru : చచ్చి పోదాం అనుకున్నాను, కన్నీళ్లు పెట్టుకున్న నైనిక

Ester Valerie Noronha : రెండో పెళ్లి చేసుకుంటున్న నోయల్ మాజీ భార్య ఎస్తేర్.. ఇతడితో ఎన్ని రోజులుంటుందో..?

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Big Stories

×