Chinmayi : ప్రముఖ టాలీవుడ్ సింగర్ చిన్మయి శ్రీపాద (Chinmayi Sripada) పాటల కంటే ఎక్కువగా వివాదాలతోనే వార్తల్లో నిలుస్తుంది. ముఖ్యంగా ఈ అమ్మడు అమ్మాయిలకు ఎదురయ్యే లైంగిక వేధింపుల గురించి ఎక్కువగా మాట్లాడుతుంది. తాజాగా మరోసారి మహా కుంభమేళాలోనే కాదు ఇంట్లోనూ అమ్మాయిలకు రక్షణ లేదు అంటూ మగవాళ్ళపై విరుచుకుపడింది.
ఇంట్లోనూ రక్షణ లేదు…
తాజాగా చిన్మయి (Chinmayi Sripada) తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో ఓ సెన్సేషనల్ పోస్ట్ ను పంచుకుంది. అందులో ఓ వీడియో గురించి ప్రస్తావించింది. ఆ పోస్ట్ లో చిన్మయి “మీమర్స్ ఇప్పుడు దీనికి సమాధానం చెప్పాలి. ఓ బస్సులో ఒక వ్యక్తి అమ్మాయితో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, అనుచితంగా టచ్ చేయడానికి ట్రై చేశాడు. ఇండియాలోని ట్రావెల్ సిస్టం ఇలాగే ఉంటుంది. ప్రతి చోటా ఇలాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి మీ అమ్మాయిలకు ఒక స్కూటీ కొనివ్వండి. అప్పుడే వాళ్ళు సురక్షితంగా ఉంటారు. ఇక ఆ అమ్మాయి చున్నీ కూడా వేసుకుంది. అయినప్పటికీ అతను ఇలా ప్రవర్తిస్తున్నాడు అంటే, ఆ వ్యక్తి బుద్ధి వంకరగా ఉంది. దుపట్టా వేసుకోలేదని మీమ్స్ చేసేవాళ్లు ఒకసారి ఇది చూస్తే మంచిది.
ఇండియాలోని ట్రావెల్ సిస్టంలోనే కాదు, టెంపుల్స్ లో క్యూ లైన్లలో కూడా ఇలాగే ఉంటుంది. మహా కుంభమేళాలో ఏం జరిగిందో చూశారు కదా. మగవాళ్ళంతా ఇంట్లోనే ఉంటే ఆడవాళ్లు సురక్షితంగా బయట తిరగగలుగుతారు. అయితే ఒకవేళ ఇంటికి ఆడవాళ్లు సురక్షితంగా తిరిగి వచ్చినప్పటికీ, ఇంట్లో కూడా వేధించేవాళ్లు ఉండే అవకాశం ఉంది” అని రాస్కొచ్చింది.
కోలీవుడ్ లో చిన్మయి బ్యాన్
ఇక చిన్మయి (Chinmayi Sripada) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదు. తన స్వీట్ వాయిస్ తో అద్భుతమైన పాటలు పాడడమే కాదు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) కు డబ్బింగ్ చెప్పి ఫుల్ పాపులర్ అయింది. అలాగే చిన్మయి టాలీవుడ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్ర (Rahul Ravindra) ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంటకి ఓ పాప ఓ బాబు ఉన్నారు. వీళ్ళిద్దరూ ట్విన్స్. ఇక చిన్మయి కొన్ని ఏళ్ల క్రితం వైరా ముత్తు తనను వేధింపులకు గురి చేశాడని ఓపెన్ అయ్యి సంచలనం సృష్టించింది. మీటూలో భాగంగా ఆమె చేసిన కామెంట్స్ కారణంగా ఆమెను కోలీవుడ్ లో బ్యాన్ చేశారు.
అప్పటి నుంచి ఆమెకు పెద్దగా పాటలు పాడే అవకాశాలు రావట్లేదు. ఇప్పుడిప్పుడే వస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది. అయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తరచుగా ఆలోచనాత్మక పోస్టులు పెడుతూ ఉంటుంది చిన్మయి. ఇక అమ్మాయిలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సరే చిన్మయి (Chinmayi Sripada) తన వాయిస్ ని రైజ్ చేస్తుంది. ఆడ వాళ్ళపై జరిగే అరాచకాలపై తరచుగా సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తాజాగా ఆమె షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.