MLC Elections: రెండు తెలుగు రాష్ట్రాలలో మళ్లీ ఎన్నికల హడావుడి మొదలు కాబోతోంది. తాజాగా ఎన్నికల కమిషన్ ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసేందుకు షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణలో 2 ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. అలాగే ఏపీలో రెండు పట్టభద్రులు, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సిద్దమైంది.
ఈ ఎన్నికలకు ఫిబ్రవరి 3 నోటిఫికేషన్ విడుదల కానుండగా, 11న నామినేషన్ల పరిశీలన, 13వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉండనుంది. అలాగే ఇదే నెల 27న పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది.
కాగా ఏపీలో ఉభయ గోదావరి జిల్లాలకు, కృష్ణా – గుంటూరు పట్టభద్రుల స్థానాలకు, శ్రీకాకుళం – విజయనగరం – విశాఖ ఉపాధ్యాయ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఇక తెలంగాణలో వరంగల్ – ఖమ్మం – నల్గొండ, మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – కరీంనగర్ ఉపాధ్యాయ స్థానాలకు, మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు.
Also Read: Gaddar Awards: గద్దర్ అవార్డులకు అర్హుడు కాదా? అసలు కథ ఇదే..
ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేయడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల హడావుడి కనిపించనుంది. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా, ఏపీలో కూటమి అధికారంలో ఉంది. ఈ పార్టీలకు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కీలకంగా మారనున్నాయి. అందుకే అభ్యర్థుల వేటలో ఆయా పార్టీలు ఉన్నట్లు సమాచారం.
తెలంగాణ , ఏపీ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఎన్నికల షెడ్యూల్
ఏపీలో రెండు పట్టభద్రుల, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి షెడ్యూల్
ఫిబ్రవరి 3న నోటిఫికేషన్, ఫిబ్రవరి 27న పోలింగ్
మార్చి 3న… pic.twitter.com/tEMJ9iHOnI
— BIG TV Breaking News (@bigtvtelugu) January 29, 2025