BigTV English

Vidaamuyarchi: ‘విడాముయార్చి’ నుంచి యాక్షన్ కింగ్ ఫస్ట్ లుక్ వేరే లెవెల్ మచ్చా

Vidaamuyarchi: ‘విడాముయార్చి’ నుంచి యాక్షన్ కింగ్ ఫస్ట్ లుక్ వేరే లెవెల్ మచ్చా

Vidaamuyarchi Arjun First Look: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఒక మంచి కంబ్యాక్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇందులో భాగంగానే వరుస సినిమాలు చేస్తున్నాడు. అందులో ‘విడాముయార్చి’ ఒకటి. ప్రముఖ రచయిత మగిజ్ తిరుమేని ఈ చిత్రాన్నికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా.. అర్జున్ సర్జా, రెజీనా కసాండ్రా, ఆరవ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ అల్లిరాజా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు.


యాక్షన్ సర్వైకల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అజిత్ సరికొత్త అవతార్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు అందరిలోనూ ఆసక్తి రేకెత్తించాయి. ఇక ఇప్పుడు మరో అప్డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి తాజాగా యాక్షన్ కింగ్ అర్జున్‌ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘‘పట్టుదలతో ఓ యువకుడి కథను తెరపై చూడాలంటే అంతకంటే ముందు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి’’ అనే ఆసక్తికరమైన థీమ్ లైన్‌తో మూవీ టీం ప్రచారం చేస్తుంది.

Also Read: వయసు పెరుగుతున్నా తరగని అందం త్రిష సొంతం.. సెకండ్ ఇన్నింగ్‌లో అదరగొట్టేస్తుంది..


ఈ కొత్త పోస్టర్‌లో అర్జున్ సర్జా లుక్ చాలా అద్భుతంగా ఉంది. చుట్టూ ఎడారి, మధ్యలో రోడ్డు, ఆ రోడ్‌పై అర్జున్ సర్జా స్టైలిష్ లుక్‌లో సన్‌గ్లాసెస్ పెట్టుకుని కనిపిస్తున్నాడు. ఆ వెనుక షాడోలో అజిత్ కనిపిస్తుండటం చూడవచ్చు. దీంతో పోస్టర్ అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ పోస్టర్‌ అభిమానుల్లో ఫుల్ జోష్ నింపింది. అయితే ఈ చిత్రంలో అర్జున్ విలన్‌గా నటించవచ్చని అభిమానులు భావిస్తున్నప్పటికీ, మేకర్స్ అతని పాత్ర వివరాలను వెల్లడించలేదు. దాదాపు 13 సంవత్సరాల విరామం తర్వాత తల అజిత్, అర్జున్ సర్జా కలిసి నటిస్తున్నారు.

వీరిద్దరూ కలిసి చివరిసారిగా 2011లో బ్లాక్‌బస్టర్ మంకథలో స్క్రీన్ స్పేస్‌ను పంచుకున్నారు. దీంతో ఇప్పుడు మళ్లీ వీళ్లిద్దరూ కలిసి నటిస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి మొదలైంది. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి మ్యూజిక్, ఒరిజినల్ స్కోర్‌ను అందిస్తున్నాడు. అలాగే నీరవ్ షా సినిమాటోగ్రాఫర్‌గా ఉన్నాడు. ఈ సినిమా OTT హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్‌లు త్వరలో రానున్నాయి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×