E-Paper
Advertisement

Actor Brahmaji: ఆ చెప్పులు ఇస్తే ముద్దు పెట్టుకుంటాను.. కల్కిపై బ్రహ్మాజీ ప్రశంసలు

Actor Brahmaji: ఆ చెప్పులు ఇస్తే ముద్దు పెట్టుకుంటాను.. కల్కిపై బ్రహ్మాజీ ప్రశంసలు
Advertisement

Actor Brahmaji: గత నాలుగురోజులుగా బాక్సాఫీస్ మీద కల్కి దాడి చేస్తూనే ఉంది. వంద కాదు రెండు వందలు కాదు.. నాలుగురోజుల్లో రూ.555 కోట్లు సాధించి రికార్డ్ సృష్టించింది. ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలి తీర్చింది. బాహుబలి తరువాత అంత గొప్ప విజయాన్ని అందుకున్నాడు ప్రభాస్. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 27 న ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయవంతంగా దూసుకుపోతున్న విషయం తెల్సిందే.

ఇక భాషతో సంబంధం లేకుండా స్టార్లు సైతం.. ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. చిరంజీవి దగ్గర నుంచి అల్లు అర్జున్ వరకు.. రజినీకాంత్ దగ్గరనుంచి సూర్య వరకు.. యష్ దగ్గరనుంచి రక్షిత్ శెట్టి వరకు తమ రివ్యూలను అభిమానులతో పంచుకుంటున్నారు. కల్కి చిత్ర బృందంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక తాజాగా నటుడు బ్రహ్మాజీ సైతం కల్కి చిత్రంపై ప్రశంసలు కురిపించాడు.

Advertisement

స్వతహాగానే బ్రహ్మాజీ సోషల్ మీడియాలో తనదైన వాక్ చాతుర్యంతో అందరిని మైమరిపిస్తూ ఉంటాడు. ఏ విషయాన్నీ అయినా కామెడీగా చెప్తూ అభిమానులను అలరిస్తూ ఉంటాడు. ఇక కల్కి రివ్యూ కూడా అలానే చెప్పుకొచ్చాడు. ” తెలుగు సినిమా అనుకొంటే వరల్డ్ సినిమా తీశారు. నాగ్ అశ్విన్ గారు మీ అరిగిపోయిన చెప్పులు ఇస్తే ముద్దు పెట్టుకొంటాను.. థాంక్యూ ప్రియాంక..స్వప్న..మీ రిస్కులే మీకు శ్రీరామ రక్ష” అంటూ రాసుకొచ్చాడు.

కల్కి రిలీజ్ కు ముందు రోజు కల్కి కోసం నాగ్ అశ్విన్.. తాను పడిన కష్టాన్ని తెలుపుతూ.. తన అరిగిపోయిన చెప్పుల ఫోటోను షేర్ చేశాడు. ఇక ఆ చెప్పులనే బ్రహ్మాజీ ముద్దుపెట్టుకుంటాను అని చెప్పుకొచ్చాడు. ఇంతకు మించిన గొప్ప ప్రశంస ఇంకేం ఉంటుంది అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇంకోపక్క ఈ సినిమాలో ఒక పాత్రలో అయినా బ్రహ్మాజీ కనిపించి ఉంటే బావుండేదని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి కల్కి పార్ట్ 2 లో బ్రహ్మాజీ ఏమైనా కనిపిస్తాడేమో చూడాలి.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×