E-Paper
Advertisement

Tollywood: ప్రపంచాన్ని మొత్తం షేక్ చేసిన ఈ కుర్రాళ్లను గుర్తుపట్టారా.. ?

Tollywood: ప్రపంచాన్ని మొత్తం షేక్ చేసిన ఈ కుర్రాళ్లను గుర్తుపట్టారా.. ?
Advertisement

Tollywood celebrity news(Cinema news in telugu): సక్సెస్.. అది ఎప్పుడు వస్తుంది అని చెప్పడం చాలా కష్టం. అద్భుతాలు జరిగేటప్పుడు ఎవరు గుర్తించరు.. జరిగాక గుర్తించాల్సిన అవసరం ఉండదు. ఈ ఫొటోలో చూస్తున్న వారు కూడా అంతే. ఒకప్పుడు ఈ ఫోటో చూసినప్పుడు ఎవరు వీళ్ళు అని అడిగేవారు. కానీ ఇప్పుడు ఇదే ఫోటోను వెతికి మరీ ట్రెండ్ చేస్తున్నారు. అదే సక్సెస్ అంటే.

ఇక ఈ ఫొటోలో ఎల్లో టీ షర్ట్ వేసుకొని ఉన్న వ్యక్తి డైరెక్టర్ నాగ్ అశ్విన్. అతని పక్కన ఉన్నది పీఆర్వో తిరుమల శెట్టి వెంకటేష్.. అతని పక్కన ఉన్నది హీరో విజయ్ దేవరకొండ. నాగ్ అశ్విన్.. ఎవడే సుబ్రహ్మణ్యం అనే సినిమాతో డైరెక్టర్ గా పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. ఇకఈ సినిమాలో సెకండ్ హీరోగా నటించింది విజయ్ దేవరకొండ. అప్పటి నుంచి వీరి మధ్య మంచి స్నేహ బంధం ఉంది.

Advertisement

నాని హీరోగా నటించినా కూడా విజయ్ కే ఎక్కువ పేరు వచ్చింది. ఇక నాగీ ప్రతి సినిమాలో విజయ్ ను ప్రత్యేక్షంగానో, పరోక్షంగానో పెడుతూనే వస్తున్నాడు. ఎవడే సుబ్రహ్మణ్యం తరువాత నాగీ.. సావిత్రి బయోపిక్ మహానటి తెరకెక్కించాడు. సున్నితమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో కూడా విజయ్ ఒక కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా కూడా అతనికి మంచి పేరును తీసుకొచ్చి పెట్టింది. అనంతరం విజయ్ స్టార్ హీరోగా మారాడు.

ఎంత పెద్ద హీరో అయినా.. ఫ్రెండ్ నాగీని మర్చిపోలేదు. తన కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉంటాడు. అలానే కల్కిలో ఒక చిన్న పాత్రలో కనిపించాలి అనగానే.. టక్కున ఒప్పేసుకున్నాడట. అలా కల్కిలో కూడా విజయ్.. అర్జునుడుగా దర్శనం ఇచ్చాడు. సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే.. అర్జునుడి పాత్ర ఒక ఎత్తు అని చెప్పాలి. థియేటర్ లో విజయ్ ఎంట్రీకి సపోర్ట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పాలి. అలా ఈ ఇద్దరూ స్నేహితులు.. మొదటి నుంచి కలిసే ఉన్నారు. ఈ ఫోటో ఎవడే సుబ్రహ్మణ్యం కన్నా ముందే దిగినట్టు కనిపిస్తుంది. పదేళ్లు అయినా కూడా వీరిద్దరూ ఇంతే సింపుల్ గా ఉండడం గ్రేట్ అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×