Manchu Mohan babu :తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న విలక్షణమైన నటులలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒకరు. అసలు కలెక్షన్ కింగ్ అని ఎందుకు పెట్టారో చాలామందికి అర్థం కాని విషయం. ఇకపోతే ఒకప్పుడు మోహన్ బాబు పరిస్థితి పక్కన పెడితే, ఇప్పుడు మాత్రం మోహన్ బాబు పిచ్చికి పరాకాష్టగా చేరింది. పాత సినిమాలలో వేసిన క్యారెక్టర్ ను రియల్ లైఫ్ లో పోషిస్తున్నాడు. మాట్లాడితే మేము గొప్ప మేము గొప్ప అని చెప్పుకునే మోహన్ బాబు ఈరోజు నీచంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. ప్రవర్తించడం పక్కన పెడితే మనుషుల మీద దాడి చేసే స్థితికి వచ్చేసారు. మోహన్ బాబు గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అహంకారానికి అసలైన అడ్రస్. ఇది చాలా సందర్భాల్లో నిరూపించబడింది. ఎప్పుడు స్టేజ్ ఎక్కిన కూడా ఏదో ఆకాశం నుంచి ఊడి పడినట్లు మాట్లాడుతూ ఉంటారు. కానీ నిజ జీవితానికి వస్తే మోహన్ బాబు నీచమైన పనులు ఇప్పుడు బయట పడుతున్నాయి.
మామూలుగా మాటలతో తెగిపోయే దానికి చేతల వరకు తీసుకొచ్చారు. నలుగురిలో మాట్లాడుకున్న విషయాన్ని పదిమందిలో పెట్టేశారు. ప్రతి కుటుంబంలో ఆస్తి తగదాలు జరగడం అనేది కామన్ గా జరుగుతుంది. కానీ క్రమశిక్షణగా పెరిగిన మోహన్ బాబు ఇంట్లో ఆస్తి తగాదాలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఏకంగా అన్నదమ్ములు తండ్రి కొడుకులు ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం మొదలుపెట్టారు. ఏం జరిగింది అని ప్రశ్నించడానికి వెళ్లిన మీడియాను సైతం కొట్టేశారు మోహన్ బాబు. ఏకంగా మైకు తీసుకుని మీడియా మీద దాడి చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పదిమందికి ఆదర్శంగా నిలబడాల్సిన హీరో అసలు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నాడు అర్థం కాని పరిస్థితి.
మామూలుగా ఒక వ్యక్తి మీద చేయి చేసుకోవడం అనేది దారుణం. కానీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక పేరు సంపాదించుకొని ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉంటూ కూడా చేయి చేసుకున్నాడు అంటే మోహన్ బాబు మానసిక పరిస్థితి ఎలా ఉంది అనేది చాలామంది సందేహం. అయ్యప్ప స్వామి సాక్షిగా అన్ని మాట్లాడే మోహన్ బాబు మనస్సాక్షిని వదిలేసాడు. పదిమందికి చెప్పాల్సిన స్థితిలో ఉన్న మోహన్ బాబు పది మందితో చెప్పించుకునే స్థితికి వచ్చేసాడు. ఇకపోతే మోహన్ బాబు దాడి చేసింది మామూలు వ్యక్తిని కాదు ఏకంగా జర్నలిస్టులను దాడి చేశాడు. జర్నలిస్టులను కొట్టారు అంటే సామాన్య మానవులను కూడా ఏ విధంగా ట్రీట్ చేస్తారు అని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు జరిగిన విషయాలన్నిటినీ పక్కనపెట్టి మోహన్ బాబు ఇప్పుడు ప్రవర్తించిన తీరు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఇండస్ట్రీ నుంచి మోహన్ బాబును మా అధ్యక్ష పదవి నుంచి విష్ణును తొలగించాలని నినాదాలు కూడా మొదలుపెట్టేశారు. ఇక ఇటువంటి కుటుంబంలోని సభ్యుడిని మా అధ్యక్షుడిగా ఎన్నుకున్నామని చాలామంది లబోదిబోమంటున్నారు. నిజమైన మోహన్ బాబుకి ఉన్న అహంకారం ఎంత అని మరోసారి రుజువైంది. ఈ తరుణంలో కన్నప్ప సినిమా కూడా కనీసం టికెట్ తెగకుండ డిజాస్టర్ అవుతుందని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.