Manchu Family Issue: మంచు ఫ్యామిలీలో వివాదం ప్రస్తుతం ప్రేక్షకులందరికీ తెలిసిపోయింది. ఒక చిన్న ఆస్తి వివాదంగా మొదలయ్యి ఇప్పుడు అన్నాదమ్ములు, తండ్రీకొడుకులు గొడవ పడే స్టేజ్‌కు వెళ్లింది. ఈ తండ్రి వర్సెస్ కొడుకు అని జరుగుతున్న వివాదం గురించి విన్న ప్రేక్షకులు చాలామంది మంచు మనోజ్‌ది ఎలాంటి తప్పు లేదంటూ తనకు సపోర్ట్‌గా మాట్లాడుతున్నారు. కానీ సొంత కుటుంబం అయిన భూమా అఖిల ప్రియ మాత్రం అస్సలు ఈ విషయంపై స్పందించడానికి ఇష్టపడడం లేదు. తన చెల్లెలు భూమా మౌనిక వైవాహిక జీవితంలో ఇంత జరుగుతున్నా కూడా అఖిల ప్రియ స్పందించకపోవడమేంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
సపోర్ట్ లేకుండానే
మంచు మనోజ్ (Manchu Manoj)కు చాలా ఏళ్ల క్రితమే ఒక ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో అరేంజ్ మ్యారేజ్ జరిగింది. కానీ ఏమైందో తెలియదు కొన్నాళ్లకే వారు విడిపోతున్నట్టుగా వార్తలు వచ్చాయి. మంచు మనోజ్ సోషల్ మీడియాలో అంత యాక్టివ్ కాకపోవడంతో తన విడాకుల విషయం నిజమా కాదా అనే విషయం కూడా చాలాకాలం వరకు బయటికి రాలేదు. మొత్తానికి తాను విడాకులు తీసుకుంటున్నట్టుగా చాలాకాలం తర్వాత అధికారికంగా ప్రకటించాడు. ఆ తర్వాత పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఫ్యామిలీలో పుట్టిన భూమా మౌనిక (Bhuma Mounika)తో ప్రేమలో పడ్డాడు మనోజ్. కానీ ఈ ప్రేమకు అటు మంచు ఫ్యామిలీ నుండి, ఇటు భూమా ఫ్యామిలీ నుండి పెద్దగా సపోర్ట్ లభించలేదు.
Also Read: భూమా మౌనిక వల్లే మంచు ఫ్యామిలీలో గొడవలు.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన పనిమనిషి
అక్క అండ లేదు
తమ ప్రేమకు సపోర్ట్ లేకపోవడంతో చాలాకాలం వరకు తమ పెళ్లిని పోస్ట్‌పోన్ చేసుకుంటూ వచ్చారు మనోజ్, మౌనిక. ఫైనల్‌గా మంచు ఫ్యామిలీ నుండి మనోజ్‌కు తన అక్క సపోర్ట్ లభించింది. తానే పెళ్లి పెద్దగా మారి మనోజ్, మౌనికలకు వివాహం జరిపించింది మంచు లక్ష్మి. ఈ పెళ్లికి కూడా ఇరు కుటుంబాల నుండి ఎవ్వరూ రాలేదు. అప్పుడే వీరి పెళ్లి ఎవ్వరికీ ఇష్టం లేదనే విషయంపై అందరికీ క్లారిటీ వచ్చేసింది. కానీ మనోజ్, మౌనిక మాత్రం తాము హ్యాపీ కపుల్‌గా ప్రపంచానికి కనిపించారు. ఇంతలోనే మంచు కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. ఇలాంటి గొడవల సమయంలో భూమా మౌనికకు అండగా నిలబడాల్సిన అక్క భూమా అఖిలప్రియ మాత్రం ఈ వివాదానికి దూరంగా ఉంటున్నారు.
కాల్స్‌కు రెస్పాన్స్ లేదు
మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవల గురించి సోషల్ మీడియా, టీవీ చూసే ప్రతీ ప్రేక్షకుడికి తెలిసింది. అలాంటిది ఈ విషయం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ (Bhuma Akhila Priya) వరకు చేరకుండా ఉంటుందా. అయినా కూడా ఆమె స్పందించకపోవడమేంటి అని అనుమానాలు వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి మాట్లాడడానికి ఎవరు ఫోన్ చేసినా ఆమె కనీసం ఆన్సర్ చేయడం లేదని సమాచారం. దీంతో మంచు ఇంటికి కోడలిగా వచ్చిన భూమా మౌనిక.. తన భర్త మనోజ్‌తో కలిసి కుటుంబంపై ఒంటరి పోరాటం చేయాల్సి వస్తుందని ప్రేక్షకులు జాలి చూపిస్తున్నారు. కనీసం భూమా అఖిలప్రియ స్పందిస్తే ఈ జంటకు సాయంగా ఉంటుందని ఫీలవుతున్నారు.