E-Paper
Advertisement

Actor Manchu Manoj: మళ్ళీ లొల్లి, పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ కి వెళ్తున్న మంచు మనోజ్

Actor Manchu Manoj: మళ్ళీ లొల్లి, పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ కి వెళ్తున్న మంచు మనోజ్
Advertisement

Actor Manchu Manoj: దాదాపు రెండేళ్ల క్రితం మంచు మనోజ్ తన ఇంటికి వచ్చి మా మనుషుల్ని విష్ణు ఎలా కొడుతున్నాడో చూడండి అంటూ ఒక వీడియోను రిలీజ్ చేశాడు. అయితే ఆ వీడియో అప్పుడు సోషల్ మీడియాలోనూ, మీడియాలోనూ బాగా వైరల్ గా మారింది. అక్కడితో మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలన్నీ అవాస్తవమని తెలుపుతూ ఇది రియాలిటీ షో కోసం మేము చేస్తున్న వీడియో అంటూ మంచు విష్ణు ఒక సందర్భంలో తెలిపారు అయితే అందరూ కూడా దానిని నిజమే అనుకొని నమ్మరు కానీ ఇప్పటివరకు ఆ రియాల్టీ షో విడుదల కాలేదు. ఇక గత కొద్దిరోజులుగా మంచి ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ గొడవలు తారాస్థాయికి చేరిపోయాయి. మంచు మనోజ్ (Manchu Manoj) మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu) మంచు విష్ణు (Manchu Vishnu) వీరి ముగ్గురు ఒకరి మీద ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకునే స్థాయికి వచ్చేసింది.

Also Read: Lavanya Tripathi: మూడేళ్ల తర్వాత వెండితెరపై మెగా కోడలి సినిమా.. బర్త్ డేకు స్పెషల్ అనౌన్స్‌మెంట్

Advertisement

ఈ వార్త సంచలనం అవుతున్న తరుణంలో అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటనలో పోలీస్ స్టేషన్ కి వెళ్లడంతో మీడియా ఫోకస్ మొత్తం అటు షిఫ్ట్ అయింది. మొత్తానికి ఒకరోజు జైల్లో గడిపి అల్లు అర్జున్ (Allu Arjun) బయటకు వచ్చేసాడు ఇప్పుడు మీడియా ఫోకస్ మొత్తం మళ్ళీ మంచు ఫ్యామిలీ మీదికి వెళ్ళింది. జల్‌పల్లిలో మరోసారి మంచు ఫ్యామిలీ వివాదం మొదలైంది. పహాడీషరీఫ్‌ పీఎస్‌కు మంచు మనోజ్‌ రాబోతున్నట్లు తెలుస్తుంది. మంచు మనోజ్‌కు చెందిన జనరేటర్‌లో పంచదార పోసారట విష్ణు. దీనితో మంచు మనోజ్‌ ఇంటికి విద్యుత్‌ సరఫర నిలిచిపోయింది. ఇక అంతా మర్చిపోతున్నారు అనుకునే టైం కి మళ్లీ ఈ వివాదం తలెత్తడంతో మరోసారి సోషల్ మీడియాలో మంచు ఫ్యామిలీ వైరల్ అవుతుంది.

ఇక వరుస వివాదాలు జరుగుతున్న తరుణంలోనే విష్ణు తన కొత్త సినిమాను కూడా అనౌన్స్ చేశాడు. మరోవైపు మోహన్ బాబు పరారీలో ఉన్నారు అంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత తన ఆరోగ్యం పరిస్థితి కారణంగా నేను నా ఇంట్లోనే ఉన్నాను. అటువంటి కథనాలు రాయకండి అంటూ మోహన్ బాబు ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఇక రీసెంట్ గా మోహన్ బాబు కూడా తన వలన గాయపడిన జర్నలిస్టును స్వయంగా వెళ్లి హాస్పిటల్లో కలిసి వాళ్ళ కుటుంబ సభ్యులకు క్షమాపణలు కూడా తెలియజేశారు. అంతేకాకుండా ఒక ఆడియోను విడుదల చేసి కూడా మోహన్ బాబు క్షమాపణలు తెలియజేశారు. అయితే మంచు వివాదం మంచిగా సైలెంట్ అయిపోయింది అనుకునే తరుణంలో మరో కొత్త మలుపు తీసుకుంది.

Advertisement

Also Read : Allu Arjun – Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను బన్నీ బాబాయ్ అని ఎందుకు పిలుస్తాడో తెలుసా.?

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×