Allu Arjun – Pawan Kalyan: మెగా హీరోలు అందరికీ కలిపి భారీగానే ఫ్యాన్ బేస్ ఉంది. ఆ హీరోల్లో అల్లు అర్జున్ కూడా ఒక భాగమే. కానీ గత కొన్నిరోజులుగా మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్‌కు విభేదాలు ఉన్నాయనే వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. తన ‘పుష్ఫ 2’ విడుదల సమయంలో కూడా మెగా హీరోలు ఎవరూ స్పందించలేదు. అందుకే తను కూడా వారి గురించి ప్రస్తావించలేదు. మొత్తానికి సక్సెస్ మీట్‌లో మాత్రం థాంక్యూ కళ్యాణ్ బాబాయ్ అని ఒక్క మాట చెప్పాడు బన్నీ. అయితే పవన్ కళ్యాణ్.. అల్లు అర్జున్‌కు మావయ్య అయితే బాబాయ్ అని ఎందుకు అన్నాడు అని అందరిలో సందేహం మొదలయ్యింది.
అలా పిలుస్తారట
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ను మావయ్య అనకుండా బాబాయ్ అనడమేంటి అంటూ అల్లు అర్జున్ (Allu Arjun) స్పీచ్ గురించి సోషల్ మీడియాలో చాలా చర్చలే జరిగాయి. అసలు అలా అనడం వెనుక కారణమేంటి అని మెగా ఫ్యామిలీ సన్నిహితుల ద్వారా ఒక క్లారిటీ వచ్చింది. అల్లు అర్జున్‌కు చిన్నప్పటి నుండి పవన్ కళ్యాణ్‌ను బాబాయ్ అనే పిలుస్తాడనే విషయం బయటపడింది. అంతే కాకుండా చిరంజీవిని చిక్ బాబాయ్ అని పిలుస్తాడట. మావయ్య అని చాలా అరుదైన సందర్భాల్లోని పిలుస్తాడని తెలుస్తోంది. చిన్నప్పటి నుండి అలాగే అలవాటు అవ్వడంతో ‘పుష్ప 2’ (Pushpa 2) సక్సెస్ మీట్‌లో కూడా పవన్ కళ్యాణ్‌ను బాబాయ్ అనేశాడు కానీ దాని వెనుక పెద్ద మిస్టరీ లేదని తెలుస్తోంది.
Also Read: ‘పుష్ప2’తో ఇండస్ట్రీ హిట్ ఇస్తే… జైలుకు పంపించి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు
అదే అలవాటు
చిన్నప్పటి నుండి రామ్ చరణ్, అల్లు అర్జున్‌తో పాటు అల్లు కుటుంబానికి చెందిన ఇద్దరు అమ్మాయిలు కలిసి పెరిగారు. ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్‌ను బాబాయ్ అని పిలిచేవారట. అలాగే అల్లు అర్జున్‌కు కూడా అలా పిలవడమే అలవాటుగా మారింది. రామ్ చరణ్ కూడా నాగబాబు, పవన్ కళ్యాణ్‌ను బాబాయ్ అనే పిలుస్తాడు. అలా ఆ ఇంట్లో బాబాయ్ అనే పిలుపు ఎక్కువగా వినిపించేది కాబట్టి అందరికీ అదే అలవాటు అయిపోయింది. అల్లు అర్జున్.. చిక్ బాబాయ్ అని పిలుస్తాడనే విషయం చాలా తక్కువమందికి తెలుసు. చిన్నప్పటి నుండి అలవాటైన పిలుపు కాబట్టి ఇప్పటికీ చిరంజీవిని బన్నీ అలాగే పిలుస్తాడట.
మెగా ఫ్యామిలీ అండ
ఏపీ ఎన్నికల ప్రచారంలో అల్లు అర్జున్‌కు, మెగా ఫ్యామిలీకి విభేదాలు మొదలయినప్పటి నుండి ఒకరి పేరును మరొకరు కనీసం ప్రస్తావించడం లేదు. అల్లు అర్జున్ హీరోగా నటించిన ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘పుష్ప 2’ రిలీజ్‌కు కూడా మెగా హీరోలు సపోర్ట్ చేయలేదు. కేవలం సాయి ధరమ్ తేజ్ మాత్రమే సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నానంటూ టీమ్‌కు విషెస్ తెలిపాడు. దానికి బన్నీ కూడా రిప్లై ఇచ్చాడు. బన్నీ అరెస్ట్‌తో మళ్లీ అందరూ ఒక్కచోట చేరారు. మెగా ఫ్యామిలీ అంతా అల్లు అర్జున్‌కు ఎప్పటికైనా అండగా ఉంటుందని మరోసారి నిరూపించింది.