Lavanya Tripathi: పెళ్లయిన తర్వాత హీరోయిన్స్ కెరీర్ ఒకేలాగా ఉండదు. పెళ్లికి ముందు ఉండేంత స్పీడ్, జోష్ కనిపించదు. చాలా తక్కువమంది హీరోయిన్లు మాత్రమే తమ కెరీర్‌పై పెళ్లి ఎఫెక్ట్ పడకుండా చూసుకుంటారు. ఆ లిస్ట్‌లో మెగా కోడలు కూడా యాడ్ అవుతుందని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. వరుణ్ తేజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi). మెగా ఇంటికి కోడలిగా మారింది. కానీ తను పెళ్లయినప్పటి నుండి సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండడం లేదు. అప్పటినుండి కేవలం ఒక్క వెబ్ సిరీస్‌లో మాత్రమే నటించింది. తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా మూడేళ్ల తర్వాత వెండితెరపై రీఎంట్రీ ఇవ్వబోతున్నానని ప్రకటించింది లావణ్య.
బర్త్ డే స్పెషల్
2023లో వరుణ్ తేజ్‌తో లావణ్య త్రిపాఠి పెళ్లి జరిగింది. పెళ్లయిన కొన్నాళ్లకే ‘మిస్ పర్ఫెక్ట్’ అనే వెబ్ సిరీస్‌లో హీరోయిన్‌గా నటించి అలరించింది. ఆ వెబ్ సిరీస్ తప్పా పెళ్లి తర్వాత తను ఇంకా ఏ సినిమాలో కూడా కనిపించలేదు. దీంతో మెగా కోడలు సినిమాలు మానేసిందని, తను ఇప్పుడు ప్రెగ్నెంట్ అనే వార్తలు కూడా వినిపించాయి. అయినా లావణ్య మాత్రం అసలు ఈ విషయాలపై స్పందించడానికి కూడా ఇష్టపడలేదు. ఒకవైపు వరుణ్ తేజ్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నా తనకు లక్ మాత్రం కలిసి రావడం లేదు. ఇంతలోనే లావణ్య రంగంలోకి దిగనుంది. డిసెంబర్ 15న తన బర్త్ డే సందర్భంగా కొత్త సినిమాను ప్రకటించింది.
Also Read: పవన్ కళ్యాణ్‌ను బన్నీ బాబాయ్ అని ఎందుకు పిలుస్తాడో తెలుసా.?
ఫీల్ గుడ్ దర్శకుడు
దుర్గా దేవీ పిక్చర్స్, ట్రయో స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘సతీ లీలావతి’ (Sathi Leelavathi) అనే సినిమాతో పెళ్లి తర్వాత మొదటిసారి వెండితెరపై కనిపించి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యింది లావణ్య త్రిపాఠి. తాటినేని సత్య ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటివరకు తాటినేని సత్య దర్శకత్వంలో ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘ఎస్. ఎమ్. ఎస్’ లాంటి సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలు కమర్షియల్ సక్సెస్ అయినా కాకపోయినా.. ప్రేక్షకుల్లో మాత్రం వీటికి మంచి పాపులారిటీ లభించింది. అలా ఇప్పుడు లావణ్య త్రిపాఠితో కలిసి ‘సతీ లీలావతి’తో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు ఈ దర్శకుడు.
లేడీ ఓరియెంటెడ్ చిత్రం
‘సతీ లీలావతి’ అనే టైటిల్ చూస్తుంటేనే ఇదొక లేడీ ఓరియెంటెడ్ చిత్రమని అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ మూవీ ఇంకా ప్రీ ప్రొడక్షన్‌లోనే బిజీగా ఉండగా.. త్వరలోనే దీనికి సంబంధించిన షూటింగ్ ప్రారంభం కానుంది. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు బయటికి వస్తాయని మేకర్స్ తెలిపారు. నాగబాబు మోహన్, రాజేష్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించనున్నాడు. 2022లో ‘హ్యాపీ బర్త్ డే’ అనే సినిమాలో చివరిసారిగా నటించి మెప్పించింది లావణ్య. కానీ ఆ మూవీ కూడా కమర్షియల్‌గా అంత సక్సెస్ కాకపోవడంతో తన ఫ్యాన్స్ అంతా కమ్ బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నారు.
Extremely excited to be a part of this project! This story caught my attention with its amazing write-up and solid team. I’m thrilled to be starting this next year
what a fantastic way to kick off the year!
.
.#tatinenisatya @MickeyJMeyer
#binendramenon #kosanamvithal… pic.twitter.com/D0KIddRreI— Lavanyaa konidela tripathhi (@Itslavanya) December 15, 2024