Malayalam actress Minu Muneer: మలయాళం సినీ పరిశ్రమను క్యాస్టింగ్ కౌచ్ వెంటాడుతోంది. నటీనటులు ఒక్కొక్కరు ఆరోపణలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారుతున్నాయి. సినిమా అవకాశాల కోసం వచ్చిన కొంతమందిపై లైంగిక వేధింపులకు గురిచేసిన వ్యవహారం సినీ పరిశ్రమను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. తాజాగా, ప్రముఖ సీనియర్ నటి మిను మున్నీరు ప్రముఖ నటులు ముకేశ్, జయసూర్య, మనియన్ పిళ్లై రాజు, ఇడవేలు బాబులపై చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం లేపుతున్నాయి.
మిను మున్నీర్.. చాలా సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. అయితే సినిమా పరిశ్రమకు వచ్చిన కొత్తలో తనకు ఎదురైన అనుభవాలను బయటపెట్టారు. ప్రముఖ నటులు ముకేశ్, జయసూర్య, మనియన్ పిళ్లై రాజు, ఇడవేలు బాబు వేధింపులు భరించలేక మలయాళ సినీ పరిశ్రమను వదిలి వెళ్లిపోయానని మిను చెప్పుకొచ్చారు.
2008లో ఓ సినిమా షూటింగ్ జరుగుతుండగా..జయసూర్య వెనుక నుంచి సడెన్‌గా వచ్చి కౌగిలించుకొని ముద్దు పెట్టాడని చెప్పింది. ఇది జరిగిన కాసేపటికే తన ఫ్లాట్ కి రావాలని బలవంతం చేశాడని తెలిపింది. అలాగే 2013లో మలయాళ నటీనటుల సంఘం ‘అమ్మ’లో సభ్యత్వం కోసం ప్రయత్నించానని చెప్పింది. ఇందులో సభ్యత్వం తీసుకోవాలంటే మూడు సినిమాల్లో నటిస్తే చాలని, నేను అప్పటికే ఆరు సినిమాల్లో నటించానని చెప్పింది. కానీ సభ్యత్వం ఇవ్వలేదన్నారు.
ఈ విషయంపై ఇడవెల బాబుకి చెబితే..ఫాం కావాలంటే తన ఫ్లాట్‌కి రావాలని చెప్పినట్లు చెప్పుకొచ్చారు. తీరా అక్కడి వెళ్లిన తర్వాత నా మెడపై ముద్దు పెట్టుకున్నాడని వాపోయింది. వెంటనే భయంతో అక్కడినుంచి పరుగులు తీశానని, ముకేశ్‌కు ఈ విషయం చెబితే..తను కూడా ఫోన్‌లో అభ్యంగా మాట్లాడి విల్లాకు వస్తావా అని అడిగినట్లు చెప్పుకొచ్చింది.
దీంతో పాటు ఒక్క సినిమా షూటింగ్ విషయంలో మణియం పిల్ల రాజు కారులో వెళ్తుండగా..అనుచితంగా మాట్లాడాడు. సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరూ ఇలా ప్రవర్థించడం బాధేసిందన్నారు. అవకాశాల కోసం..వచ్చిన అవకాశాన్ని కాపాడుకునేందుకు ఇలాంటి భరించానని, ఇంకా చేసేది ఏమీలేక ఆ నలుగురి వల్ల చెన్నై వెళ్లిపోయానని వాపోయింది.
Also Read: అప్పుడు నాకు 20 ఏళ్లు, హోటల్ నుంచి ఆ నటుడు ఫోన్.. 19 ఏళ్ల నాటి ఘటన మళ్లీ తెరపైకి!
ఇదిలా ఉండగా, కేరళ ప్రభుత్వం మహిళా నటీమణులు ఎదుర్కొంటున్న సమస్యలపై 2019లో జస్టిస్ హేమ కమిటీ ఏర్పాటు చేసింది. అయితే ప్రభుత్వానికి కమిటీ నివేదిక ఇచ్చినప్పటికీ ఎలాంటి విషయాలు బయటపడలేదు. తాజాగా, ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఇందులో భాగంగానే నటి మిను మున్నీర్ తనకు ఎదురైన ఇబ్బందులను వెల్లడించింది.