BigTV English

Hema Committee Report: అప్పుడు నాకు 20 ఏళ్లు, హోటల్ నుంచి ఆ నటుడు ఫోన్.. 19 ఏళ్ల నాటి ఘటన మళ్లీ తెరపైకి!

Hema Committee Report: అప్పుడు నాకు 20 ఏళ్లు, హోటల్ నుంచి ఆ నటుడు ఫోన్.. 19 ఏళ్ల నాటి ఘటన మళ్లీ తెరపైకి!

Hema Committee Report impact metoo allegations against mollywood actors mukesh resurfaces:  మలయాళ సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల ఆరోపణలపై వివాదాలు వేడెక్కుతున్న తరుణంలో..  మహిళా కాస్టింగ్ డైరెక్టర్ టెస్ జోసెఫ్ 2018 పోస్ట్ మళ్లీ తెరపైకి వచ్చింది. మలయాళ నటుడు, సీపీఎం ఎమ్మెల్యే ముకేష్ తనను 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నిత్యం వేధించేవాడని బాలీవుడ్‌లో యాక్టివ్ కాస్టింగ్ డైరెక్టర్ అయిన టెస్ జోసెఫ్ 2018లో ముఖేష్‌పై #MeToo ఆరోపణ చేశారు.


ఈ సంఘటన 19 సంవత్సరాల క్రితం జరిగిందని టెస్ జోసెఫ్ వెల్లడించింది. తాను ‘కోటీశ్వరన్’ షోకి దర్శకత్వం వహిస్తున్నప్పుడు తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వివరిస్తూ.. నటుడు ముకేష్ హోటల్ గది నుంచి తనకు నిత్యం ఫోన్ కాల్ చేశేవాడని. ఆ ఫోన్ కాల్ లిఫ్ట్ చెయ్యకపోవడంతో.. తదుపరి షెడ్యూల్ సమయంలో తనకు తెలియకుండానే తన గదిని ముకేష్ గది పక్కనే మార్చినట్లు ఆమె ఆరోపించింది. ఆ క్లిష్ట సమయంలో తన మాజీ బాస్ బెంగాల్ ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్ ఎంతో సహాయం చేశారని.. ఆ పోస్ట్ లో అయనకు ధన్యవాదాలు తెలిపింది.

ఇదిలా ఉంటే.. మలయాళ సినీ రంగంలో మహిళల ఇబ్బందులు, వారి పరిస్థితులపై జస్టిస్‌ హేమా కమిటీ రిపోర్ట్‌ పరిశ్రమను కుదిపేస్తోంది. దానిపై ఇప్పుడు తీవ్ర చర్చ సాగుతోంది. కొందరు మహిళా నటులు పలువురు ప్రముఖల నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నామని ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. ఈ ఆరోపణలపై దర్యాప్తునకు కేరళ ప్రభుత్వం సిద్ధమైంది. ఏడుగురు పోలీసు ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది.


మలయాళీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ తనను ఇబ్బంది పెట్టాడని ఓ నటి ఆరోపించింది. బెంగాలీ నటి శ్రీలేఖ ప్రముఖ డైరెక్టర్‌, కేరళ స్టేట్‌ సినీ అకాడమి అధ్యక్షుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది. ఈ ఆరోపణల నేపథ్యంలో కేరళ స్టేట్ చలనచిత్ర అకాడమీకి చెందిన పలువురు సినీ పెద్దలు రాజీనామా చేశారు. ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఐజీ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేశారు.

Also Read: చిత్ర పరిశ్రమలో వేధింపులు.. విచారణ కోసం కమిటీ ఏర్పాటు

కేరళ ప్రభుత్వం 2019లో మలయాళ సినీ ఇండస్ట్రీలో ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసేందుకు హేమ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రభుత్వానికి ఆ కమిటీ నివేదికను ఎప్పుడో అందించింది. అయితే అందులోని విషయాలు పూర్తిగా బయటకు రాలేదు. తాజాగా సమాచార హక్కు చట్టం కింద నివేదికలోని విషయాలు బయటకు వచ్చాయి.

మాలీవుడ్‌లో పనిచేసే మహిళా నటులపై వేధింపుల విషయాన్ని నివేదికలో తెలిపారు. కొంతమంది మత్తులో ఉంటూ మహిళల రూమ్‌ కు  వెళ్లి వారిని వేధించే వారని.. అనేకమంది లైంగిక వేధింపులకు గురయ్యారని తెలిపింది. చాలా భయంతో పోలీసులకు ఫిర్యాదులు చేయలేకపోయారని నివేదికలో తెలిపారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×