BigTV English

Nani: బ్రేకింగ్.. అల్లు అర్జున్ కు సపోర్ట్ గా నాని.. ట్వీట్ వైరల్

Nani: బ్రేకింగ్.. అల్లు అర్జున్ కు సపోర్ట్ గా నాని.. ట్వీట్ వైరల్

Nani: సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే. నాంపల్లి కోర్టులో విచారణకు అల్లు అర్జున్ ను హాజరుపరచగా 14 రోజులపాటు రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. కొద్దిసేపటిలో బన్నీని జైలుకు తరలించనున్నారు. ఇక ఒక స్టార్ హీరో అన్యాయంగా అరెస్ట్ అయితే  ఇండస్ట్రీ ఏమి పట్టనట్లు ఉండడం.. చర్చనీయాంశంగా మారింది.


ఇప్పటివరకు పుష్ప నిర్మాతలు,  మెగా ఫ్యామిలీ తప్ప.. ఇండస్ట్రీలో ఎవరు  బన్నీ అరెస్ట్ పై గొంతు ఎత్తింది లేదు అనుకొనేలోపు న్యాచురల్ స్టార్ నాని తన గళాన్ని విప్పాడు. సంధ్యా థియేటర్ లో జరిగిన ఘటనకు కేవలం బన్నీ మాత్రమే బాధ్యత వహించడు.. ఇందులో అందరి తప్పు ఉందని ట్వీట్ చేయడం సంచలనంగా మారింది.

Allu Arjun : అల్లు అర్జున్ అరెస్ట్ పై టాలీవుడ్ మౌనం… బన్నీకి సపోర్ట్ ఇచ్చిన ఫస్ట్ స్టార్ ఈయనే


” సినిమా వ్యక్తులకు సంబంధించిన ఏ విషయంలోనైనా ప్రభుత్వ అధికారులు మరియు మీడియా షో లాంటి ఉత్సాహం సాధారణ పౌరుల విషయంలో  జరిగినప్పుడు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. మనం మంచి సమాజంలో జీవించేవాళ్లం. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన.. ఎంతో హృదయవిదారకంగా ఉంది. అయితే  మనమందరం ఈ విపత్తు నుండి నేర్చుకోవాలి.  ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మళ్లీ జరగకుండా చూసుకోవడానికి చర్యలు తీసుకోవాలి. ఇక్కడ మనందరి తప్పు ఉంది. దీనికి ఒక వ్యక్తి బాధ్యత వహించడు” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

డిసెంబర్ 4 న పుష్ప 2 బెన్ ఫిట్ షో హైదరాబాదులోని సంధ్యా థియేటర్లో సినిమా చూడడానికి పెద్ద ఎత్తున ఆడియన్స్ వచ్చారు. అయితే అదే రోజు ఆ థియేటర్లో సినిమా చూడడానికి అల్లు అర్జున్ కూడా వచ్చారు. అల్లు అర్జున్ ని చూడడానికి అభిమానులు ఎగబడగా తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో 39 సంవత్సరాల రేవతి అనే మహిళ అక్కడికక్కడే మరణించగా.. ఆమె కొడుకు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.

Pawan Kalyan: అల్లు అర్జున్ కోసం స్పెషల్ ఫ్లైట్ లో వస్తున్న పవన్ కళ్యాణ్.. ?

ఇక అల్లు అర్జున్ రావడమే రేవతి మృతికి కారణమని పోలీసులు అతనిపై కేసు పెట్టారు. బన్నీ సైతం ఆ కేసును కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశాడు. అది విచారించేలోపే బన్నీ అరెస్ట్ చేసి కోర్టుకు తరలించగా.. కోర్ట్ ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించింది. మరి నానిలానే ఇండస్ట్రీ మొత్తం బన్నీకి సపోర్ట్ గా నిలుస్తుందా..లేదా అనేది చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×