Indian Railways Tickets Cancellations Money: ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే నెట్ వర్క్ లలో ఒకటైన భారతీయ రైల్వే, ప్రతి రోజు కోట్ల మంది ప్రయాణీకులను తమ గమ్యాలకు చేర్చుతుంది. రైల్వే టికెట్ల అమ్మకం ద్వారా భారీగా ఆదాయాన్ని అర్జిస్తున్నది. టికెట్ల క్యాన్సిలేషన్ ద్వారా కూడా పెద్ద మొత్తంలో ఆదాయాన్ని పొందుతున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. కేవలం టికెట్ల క్యాన్సిలేషన్ ద్వారా ఏడాదికి భారతీయ రైల్వేకు రూ. 1,000 కోట్లకు పైగా ఆదాయం లభిస్తున్నట్లు తెలిపారు. పార్లమెంట్ లో విపక్ష సభ్యులు రైల్వే ఆదాయం గురించి అడిగిన ప్రశ్నలకు ఆయన లిఖితపూర్వక సమాధానం చెప్పారు.
టికెట్ క్యాన్సిలేషన్ పైగా ఛార్జీలు
భారతీయ రైల్వే సంస్థ రెండు రకాల టికెట్లను విక్రయిస్తుంది. వాటిలో ఒకటి కన్ఫర్మ్ టికెట్లు కాగా, మరొకటి వెయిటింగ్ లిస్ట్(RAC) టిక్కెట్లు. రిజర్వేషన్ చార్టులను రెడీ చేసినప్పుడు, చాలా మంది ప్రయాణికులు ధృవీకరించబడిన టికెట్లను పొందకపోతే వెయిటింగ్ లిస్ట్ లో ఉంటారు. IRCTC వెబ్ సైట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకుంటే వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అవుతాయి. రిజర్వేషన్ కౌంటర్ లో తీసుకున్న టికెట్లను మాత్రం ప్రయాణీకుడు మాన్యువల్ గా క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది. రైల్వే నిబంధనల ప్రకారం టికెట్లను రద్దు చేసేటప్పుడు ప్రయాణీకుడు రిజర్వేషన్ ఛార్జీలు చెల్లించాలి. రైలు బయలుదేరడానికి 48 గంటల ముందు ప్రయాణీకుడు కన్ఫార్మ్ టికెట్ ను రద్దు చేస్తే, ఫ్లాట్ ఛార్జ్ చెల్లించాలి. AC/ఎగ్జిక్యూటివ్ క్లాస్‌కి రూ. 240, AC 2 టైర్‌కి ఛార్జీలు రూ. 200, AC 3 టైర్/ AC చైర్ కార్,/ AC 3 ఎకానమీకి రూ. 180, స్లీపర్, సెకండ్ క్లాస్‌కి రూ. 60 వసూళు చేస్తారు.
రైలు బయల్దేరే సమయాన్ని బట్టి ఛార్జీలు
రైలు బయలుదేరడానికి 48 గంటల ముందు కన్ఫార్మ్ టికెట్లను క్యాన్సిల్ చేస్తే అధిక ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం.. రైలు బయల్దేరడానికి 48 గంటల మధ్య రద్దు చేసినట్లయితే, టికెట్ ఛార్జీలో 25% తగ్గించబడుతుంది. రైలు బయలుదేరే 12 గంటల ముందు రద్దు చేస్తే, టికెట్ ఛార్జీలో 50% తగ్గుతుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి సెకండ్ ఏసీ టైర్‌లో ఆరు టిక్కెట్లు బుక్ చేసి, మొత్తం ఆరు టిక్కెట్లను రద్దు చేస్తే రూ.1200 చెల్లించాల్సి ఉంటుంది.
Read Also: వందే భారత్ వేగానికి.. రైలు కింద నలిగిపోయిన విద్యార్థి, ఇలా కూడా జరుగుతుందా?
2017-2020 మధ్యలో రూ. 9,000 కోట్ల ఆదాయం
రైల్వే సంస్థ టికెట్ల రద్దు ద్వారా 2017-2020 మధ్య రూ. 9,000 కోట్లు ఆర్జించిందని సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సెంటర్ (CRIS) తెలిపింది. ఇందులో టికెట్ క్యాన్సిల్ ఫీజుతో పాటు కన్వీనియన్స్ ఫీజు కూడా ఉన్నట్లు వెల్లడించింది. కన్వీనియన్స్ ఫీజు ద్వారా 2019-20లో రూ. 352.33 కోట్లు, 2020-21లో రూ. 299.17 కోట్లు, 2021-22లో రూ. 694.08 కోట్లు, 2022-23లో రూ. 604. 40 కోట్లు సాధించినట్లు తెలిపింది.
Read Also: విమానాలకు ఎక్కువగా వైట్ కలర్ ఎందుకేస్తారు? న్యూజిలాండ్‌లో మాత్రం నల్ల రంగు ఎందుకు?