BigTV English

Allu Arjun Remand : బన్నీ రిమాండ్… హై కోర్టు ఏం చెప్పిందంటే..?

Allu Arjun Remand : బన్నీ రిమాండ్… హై కోర్టు ఏం చెప్పిందంటే..?

Allu Arjun Remand : టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కు నాంపల్లి హైకోర్టు షాక ఇచ్చిన సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఆయనను పోలీసులు అరెస్ట్ చేయగా, గాంధీ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పోలీసులు బన్నీని నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసులో విచారణ జరిపిన అనంతరం న్యాయమూర్తి అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అల్లు అర్జున్ ను ప్రస్తుతం చంచల్ గూడా జైలుకు తరలించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మరోవైపు అల్లు అర్జున్ హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ జరుగుతుంది.


హైకోర్టులో ఈ కేసుపై వాడి వేడిగా వాదనలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఘటనలో తన క్లయింట్ కు ఎలాంటి సంబంధం లేదని అల్లు అర్జున్ తరఫున న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదిస్తున్నారు. బెనిఫిట్ షోలకు సంబంధించిన సమాచారాన్ని ముందుగానే ఇచ్చామని లాయర్ కోర్టుకు తెలపగా, అక్నాలెడ్జ్మెంట్ తీసుకున్నారా ? అని కోర్టు ప్రశ్నించింది. అయితే డిసెంబర్ 2నే బందోబస్తు కోసం లేఖ రాసినట్టుగా అడ్వకేట్ తెలిపారు. అంతేకాకుండా ఈ మేరకు చిక్కడపల్లి ఏసీపీ సంతకం చేసిన కాపీని కూడా బన్నీ తరపు న్యాయవాది కోర్టుకు అందజేసినట్టుగా తెలుస్తోంది.

థియేటర్ కు వెళ్ళడానికి నటుడు అనుమతి తీసుకున్నాడు కదా ? అని హైకోర్టు ప్రశ్నించగా, అనుమతి తీసుకున్నప్పటికీ, హీరో హీరోయిన్ లను థియేటర్ కు పిలవద్దు అని పోలీసులు థియేటర్ యాజమాన్యంకు లేఖ రాశారని జిపి వెల్లడించారు. మరి థియేటర్ యాజమాన్యం హీరోకు ఈ విషయం చెప్పారా ? ఒకవేళ చెబితే ఎలా చెప్పారు ? అని హై కోర్టు ప్రశ్నించినట్టుగా తెలిసింది.


ఇక నోటీసులు ఇవ్వకుండానే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది అక్రమ అరెస్ట్, కేసును కొట్టేయండి అని బన్నీ తరపు న్యాయవాది తన వాదనలు విన్పించారు. రేవతి చనిపోవడానికి అల్లు అర్జున్ ప్రత్యేక్ష కారణం కాదు అని బన్నీ లాయర్ వాదించగా… సంధ్య థియేటర్ భద్రత కోరుతూ లేటర్ రాసింది. కానీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అల్లు అర్జున్ ర్యాలీగా రావడం వల్లే తొక్కిసలాట జరిగిందని పోలీసుల లాయర్ జీపీ కోర్టుకు వెల్లడించారు.

అయితే విచారణ సందర్భంగా జిపి ఈ కేసులో ఇప్పటిదాకా ఏడుగురిని అరెస్ట్ చేసామని, అల్లు అర్జున్ ను కూడా రిమాండ్ చేసామని తెలిపినట్టు సమాచారం. అయితే అల్లు అర్జున్ కేసులో క్యాష్ కానీ, బెయిల్ కానీ ఇవ్వద్దని జిపి వాదనలో వినిపించారట. విచారణను సోమవారానికి వాయిదా వేయాలని ఈ మేరకు జీపీ న్యాయస్థానాన్ని కోరినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం హైకోర్టులో దీనిపై వాడివేడిగా వాదనలు జరుగుతున్నాయి. హైకోర్టులో తీర్పు వచ్చిన తర్వాతే నాంపల్లి కోర్టు రిమాండ్ పై స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం హైకోర్టు తీర్పు పై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.

ఇక మరోవైపు ఇప్పుడిప్పుడే అల్లు అర్జున్ కు సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు సెలబ్రిటీలు. ఇప్పటికే అల్లు అర్జున్ అరెస్ట్ ని ఖండిస్తూ వరుణ్ ధావన్ రియాక్ట్ కాగా, తాజాగా నాని ట్వీట్ చేశారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×