BigTV English

Pawan Kalyan: అల్లు అర్జున్ కోసం స్పెషల్ ఫ్లైట్ లో వస్తున్న పవన్ కళ్యాణ్.. ?

Pawan Kalyan: అల్లు అర్జున్ కోసం స్పెషల్ ఫ్లైట్ లో వస్తున్న పవన్ కళ్యాణ్.. ?

Pawan Kalyan: సంధ్య థియేటర్ కేసు లో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం తెల్సిందే.  డిసెంబర్‌ 4, రాత్రి 9గంటలకు హైదరాబాద్‌ సంధ్య థియేటర్‌లో పుష్ప 2 ను అభిమానులతో వీక్షించడానికి వచ్చిన అల్లు అర్జున్ ను చూడడానికి ప్రేక్షకులు తోసుకున్నారు. ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. మహిళ మృతి తరువాత అల్లు అర్జున్‌తో పాటు సంధ్య యాజమాన్యం, అల్లు అర్జున్ వ్యక్తిగత భద్రత సిబ్బందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. 105, 118(1)r/w3(5) BNS యాక్ట్ కింద కేసు నమోదైంది. రెండు రోజుల తరువాత  రేవతి మృతిపై అల్లు అర్జున్ స్పందించాడు.


” అనుకోకుండా సంధ్య థియేటర్లో జరిగిన సంఘటన మమ్మల్ని ఎంతగానో కదిలించింది. గత 20 సంవత్సరాలుగా ఇలాగే వస్తున్నాము కానీ ఆరోజు కొంచం ఎక్కువ జనం ఉండటంతో ఇబ్బంది అవుతుంది అని థియేటర్ యాజమాన్యం చెప్పగానే వెళ్ళిపోయాం. కానీ, ఇంటికి వచ్చిన తరువాత రోజు జరిగిన సంఘటన గురించి తెలిసింది. అది తెలిసి చాల బాధ కలిగింది. ఆ షాక్ నుంచి నేను వెంటనే కోలుకోలేకపోయాను. చాలాసేపు దాని గురించే ఆలోచించాను. అందుకే ఆ ఘటనపై స్పందించడానికి టైమ్ పట్టింది. ఆ కుటుంబానికి రూ. 25 లక్షలు ఆర్థిక సహాయం అందిస్తున్నాను” అని చెప్పుకొచ్చాడు.

Mohan Babu Arrest : జర్నలిస్ట్ దాడి కేసులో మరికాసేపట్లో మోహన్ బాబు అరెస్ట్…


అంతేకాకుండా  తనపై ఉన్న కేసును కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ కూడా వేశాడు. అది విచారించకముందే చిక్కడపల్లి పోలీసులు నేడు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో ప్రవేశ పెట్టారు. నేటి ఉదయం బన్నీ బెడ్ రూమ్ వరకు వెళ్లి.. పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు. బట్టలు కూడా మార్చుకోనివ్వకుండా తీసుకురావడం కరెక్ట్ కాదని బన్నీ ఫైర్ అయ్యాడు. ఇక అల్లు అర్జున్ అరెస్ట్ తో ఇండస్ట్రీ  షేక్ అయ్యింది. రెండు తెలుగురాష్ట్రాల్లో కలకలం రేగింది.

వైసీపీ నేతలు అల్లు అర్జున్ అరెస్ట్ అన్యాయమని చెప్పుకొస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పుకొచ్చారు. కష్టకాలంలో తోడుగా ఉండేవాడే నిజమైన బంధువులు అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఆ విషయంలో మెగా ఫ్యామిలీ ఎప్పుడు ముందు ఉంటుంది. మెగా – అల్లు కుటుంబాల మధ్య గత కొన్నిరోజులుగా విభేదాలు నడుస్తున్న విషయం తెల్సిందే.

Allu Arjun: బన్నీ అరెస్ట్.. ఇది కూడా రౌండ్ చేశావా అన్న అంటూ ట్రోలింగ్

అవేమి పట్టించుకోకుండా అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడంతోనే.. మెగాస్టార్ చిరంజీవి దంపతులు.. అల్లు అరవింద్ ఇంటికి చేరుకున్నారు. ఆయనకు తోడుగా నిలబడి ధైర్యం చెప్పారు. కేవలం మెగాస్టార్ మాత్రమే కాకుండా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అల్లు అర్జున్ కోసం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే స్పెషల్ ఫ్లైట్ లో హైదరాబాద్ కు బయలుదేరినట్లు తెలుస్తోంది. మరి కొద్దిసేపటిలో పవన్ కళ్యాణ్.. బన్నీ ఇంటికి చేరుకోనున్నారు. ఇకపోతే  కోర్టు బన్నీకి  14 రోజుల రిమాండ్ ను విధించింది. మరి కొద్దిసేపటిలో అల్లు అర్జున్ ను చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు. మరి ఈ వివాదంపై పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×