BigTV English

Navdeep: హమ్మయ్య.. ఈ ఒక్కసారికి నన్ను వదిలేసారు: రేవ్ పార్టీపై నవదీప్ కామెంట్స్

Navdeep: హమ్మయ్య.. ఈ ఒక్కసారికి నన్ను వదిలేసారు: రేవ్ పార్టీపై నవదీప్ కామెంట్స్

Navdeep Reacts On Bengaluru Rave Party(Tollywood celebrity news): బెంగళూరు రేవ్ పార్టీ ఎంత సంచలనం సృష్టించిందో పెద్దగా చెప్పాల్సిన పని లేదు. ఏ టీవీ చూసినా అవే వార్తలు, ఏ మొబైల్ చూసినా అదే న్యూస్. ఈ రేవ్ పార్టీలో ఎంతోమంది రాజకీయ లీడర్లు, అలాగే ప్రముఖ సినీ నటీ నటులు ఉన్నారు. అందులో నటి హేమ పేరు బయటకు వచ్చి సంచలనం క్రియేట్ చేసింది. అంతేకాకుండా శ్రీకాంత్, జానీ మాస్టర్‌తో సహా మరికొందరి పేర్లు కూడా వినిపించాయి.


ఈ నటీ నటులు రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లు కూడా నార్కోటిక్ టీమ్ తెలిపింది. తాజాగా ఈ రేవ్ పార్టీపై నటుడు నవదీప్ స్పందించాడు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతడు రేవ్ పార్టీపై ఆసక్తికర విషయాల్ని వెల్లడించాడు. ఈ మేరకు తాను నటిస్తున్న కొత్త సినిమా ‘లవ్ మౌళి’ త్వరలో రిలీజ్ కానుంది. ఇందులో భాగంగానే ప్రమోషన్స్‌లో పాల్గొన్న నవదీప్‌కు మీడియా వారు సినిమా, రేవ్ పార్టీ గురించి పలు ప్రశ్నలు అడిగారు.

అయితే వారు అడిగిన ప్రశ్నలకు నవదీప్ సమాధానం చెప్పాడు. రేవ్ పార్టీ గురించి నవదీప్ మాట్లాడుతూ.. బెంగళూరు రేవ్ పార్టీకి తాను వెళ్లినట్లు గాసిప్ వార్తలు రాకపోవడం చాలా సంతోషకరమైన విషయం అన్నాడు. ‘‘సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఏవైనా సంచలనంగా మారితే మీపై ఆరోపణలు వచ్చేవని.. కానీ ఈ సారి రాలేదు ఏంటి’’ అని ఓ రిపోర్టర్ ప్రశ్న అడిగారు. దీనిపై స్పందించిన నవదీప్.. ‘‘అలా జరగడం మంచిదే కదండి.. ఈ ఒక్కసారికి అయినా నన్ను వదిలేసారు’’ అంటూ నవ్వుతూ బదులిచ్చాడు. అంతేకాకుండా రేవ్ పార్టీ అంటే రేయి.. పగలు జరిగేదని.. అయితే ఇది ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుందని అన్నాడు.


Also Read: బెంగుళూరు రేవ్ పార్టీ గురించి ప్రశ్న.. ‘ఏం మాట్లాడుతున్నావ్’.. అంటూ ఫైర్ అయిన మంచు లక్ష్మీ

ఇక నవదీప్ నటిస్తున్న లవ్ మూవీ విషయానికొస్తే.. ఈ మూవీ చాలా కొత్తగా ఉంటుందని అన్నాడు. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల్ని బాగా అలరిస్తుందని చెప్పాడు. ఈ సినిమా కచ్చితంగా యూత్‌కి నచ్చుతుందని అన్నాడు. ఈ మేరకు ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి తమ సినిమాను ఆదరించాలని కోరాడు. కాగా ఈ సినిమా జూన్ 7న థియేటర్లలో రిలీజ్ కానుంది.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×