E-Paper
Advertisement

Prabhas Food Cost : డార్లింగ్ ప్రభాస్.. ఒక్కరోజు భోజనం ఖర్చెంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ..

Prabhas Food Cost : డార్లింగ్ ప్రభాస్.. ఒక్కరోజు భోజనం ఖర్చెంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ..
Advertisement
Prabhas Food Cost

Prabhas Food Cost : పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ పేరు వినగానే గుర్తొచ్చేది బాహుబలి మాత్రమే కాదు.. ఫుడ్ కూడా. అవును మీరు కరెక్ట్ గానే చదివారు. ఆతిథ్యం విషయంలో తెలుగు హీరోల్లో మన డార్లింగ్ ని మించిన వాళ్ళు లేరు. ప్రభాస్ మంచి భోజన ప్రియుడు.. ఈ విషయం అభిమానులకు బాగా తెలుసు.. ఎన్నో రకాల వంటకాలు అయన కోసం ప్రతేకంగా వండి పెడుతుంటారు. ఇవన్నీ అందరికి తెలుసుకాని ప్రభాస్ ఫుడ్ కోసం ఒక్క రోజులో ఎంత ఖర్చు చేస్తాడో తెలుసా ?

షూటింగ్ సెట్లో ప్రభాస్ తనకోసం మాత్రమే కాదు.. సెట్ లో పనిచేసే టీమ్ కి కూడా ప్రభాస్ భోజనాలు ఏర్పాటు చేస్తాడట. ప్రభాస్ ఇంటికి వెళ్ళిన వారికి దగ్గరుండి మరీ భోజనం వడ్డిస్తారని టాక్. ప్రభాస్ కి ఎంతో ఇష్టమైన వంటకాల్లో నాటుకోడి పులుసు, రొయ్యల పులావ్ ముందున్నాయి. వీటితో పాటు మాగాయి పచ్చడి, వాళ్ళ అమ్మ చేసే పప్పు కూడా చాలా ఇష్టంగా తింటారట.

Advertisement

ప్రభాస్ షూటింగ్ ఎక్కడ ఉన్నా.. ఫుల్ గా నాన్ వెజ్ – వెజ్ వంటకాలు చుట్టూ వుండాల్సిందే అంట. ప్రభాస్ ఒంటరిగా భోజనం చేయరు.. చుట్టూ పది మంది వుండాల్సిందే అని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ప్రభాస్ తన ప్రియమైన వారి కోసం ఇంటి భోజనం పంపించడం అలవాటు. ఈ విషయం రాజమౌళి, పూజా హెగ్డే , ఇటీవల రిలీజైన సలార్ లో నటించిన పృథ్వి రాజ్ వరకు చాలామంది చెప్పారు. ఇన్ స్టా లో ప్రభాస్ పంపిన ఫుడ్ ఫోటోలను కూడా పోస్ట్ చేసారు.

ప్రభాస్ ఇంట్లో వంట చేయడానికి ఏకంగా ఒక టీమ్ ఉందట. ప్రభాస్ కోసం నాన్ వెజ్ లో ఎక్కువగా చేపలు, రొయ్యలు, మటన్ తో పాటు ఎన్నో రకాల వెరైటీలు వండి పెడతారట. ఒక రోజు ప్రభాస్ కోసం ప్రిపేర్ చేసే భోజనం ఖర్చు అక్షరాలా రూ.2 లక్షలు ఉంటుందట. ఎంత రూమర్ అయినా సరే ఆల్మోస్ట్ నిజమే కావచ్చు. ప్రభాస్ లాంటి కటౌట్ కి ఆ మాత్రం ఖర్చు వుండాల్సిందే అని అభిమానులు, నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు .

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×