BigTV English

Prakash Raj: ఓటు వేసిన నటుడు ప్రకాష్ రాజ్.. మార్పుకోసం ద్వేషానికి వ్యతిరేకంగా అంటూ వీడియో రిలీజ్

Prakash Raj: ఓటు వేసిన నటుడు ప్రకాష్ రాజ్.. మార్పుకోసం ద్వేషానికి వ్యతిరేకంగా అంటూ వీడియో రిలీజ్

Prakash Raj: సినీ ఇండస్ట్రీలో నటుడు ప్రకాష్ రాజ్‌ది ప్రత్యేక శైలి. తన నటనతో ఎంతో మందిని నవ్వించగలడు, అలాగే ఏడిపించగలడు. సినిమా ఏదైనా, పాత్ర ఏదైనా నటనతో జీవించే శైలి ఆయనది. ఆయన ఏదైనా సినిమాలో నటిస్తున్నాడు అంటే ఆ సినిమాలో కచ్చితంగా యాక్షన్ సన్నివేశాలు లేదా ఎమోషన్ సీన్లు ఉంటాయని ప్రేక్షకులు అభిప్రాయపడతారు.


ఒక్క తెలుగులోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఏడాదికి పలు సినిమాలు చేస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి ఓ రేంజ్‌లో ఉంది. 2024 లోక్‌సభ ఎన్నికల్ సెకండ్ దశ పోలింగ్ ఇవాళ(ఏప్రిల్ 26)న జరుగుతోంది.

ఈ సందర్భంగా సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ప్రజలు తమ ఓటును వినియోగించుకుంటున్నారు. ఇందులో భాగంగానే తాజాగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తన విలువైన ఓటును వినియోగించుకున్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియోను పంచుకున్నాడు.


Also Read: బీజేపీ లోకి ప్రకాష్ రాజ్.. నన్ను వాళ్లు కొనలేరు!

ఆ వీడియో ప్రకారం.. హలో ఫ్రెండ్స్ అంటూ తాను తన ఓటును వేసినట్లు తెలిపాడు. అంతేకాకుండా మార్పు కోసం ఓటు వేశానని అన్నాడు. తాను ద్వేషానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్లు ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు. సభలో మన గళం విస్తరిస్తుందని తాను విశ్వసించే ప్రాతినిధ్యానికి ఓటు వేసినట్లు తెలిపాడు. అంతేకాకుండా ప్రజలకు కూడా అవగాహన కల్పించాడు. మీరు కూడా మీ విలువైన ఓటును వినియోగించుకోండి అని చెప్పాడు. మీ ఓటు ద్వారా మార్పు రావచ్చు అంటూ అందరికీ చాలా ధన్యవాదాలు తెలిపాడు.

ప్రస్తుతం అతడి వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. దీనిపై పలువురు రకరకాలుగా స్పందిస్తున్నారు. కచ్చితంగా మార్పు తెద్దాం సార్ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. అలాగే మరొక నెటిజన్ స్పందిస్తూ.. మీలాంటి నటులు ఇప్పుడు ఎక్కడున్నారు సర్ అంటూ తమ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. ఇక ప్రకాశ్ రాజ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం అతడి చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి. దేవర, పుష్ప 2, రాయన్, ఓజీ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తున్నాడు.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×