BigTV English
Advertisement

Komatireddy Venkat Reddy: ఎమ్మెల్యే పదవి వదులుకునేందుకు హరీశ్ రావు భయపడుతున్నారు..

Komatireddy Venkat Reddy: ఎమ్మెల్యే పదవి వదులుకునేందుకు హరీశ్ రావు భయపడుతున్నారు..

Komatireddy Venkat Reddy: తెలంగాణ కోసం తాను మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసానని.. హరీశ్ రావు మాత్రం ఎమ్మెల్యే పదవిని వదులుకునేందుకు భయపడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీని విమర్శించడం మానుకోవాలని అన్నారు.


గన్ పార్క్ వద్ద రాజీనామా లేఖతో హరీశ్ రావు డ్రామా చేశారని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. నాటకాల రాయుడు హరీశ్ రావు.. ఇప్పుడు జోకర్‌లా మారారని మంత్రి ఫైర్ అయ్యారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా లేఖ ఎలా ఉంటుందో తెలియదా అని విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నేతల డ్రామాలు ఇక సాగవని విమర్శల వర్షం గుప్పించారు.

సీఎంకు సవాల్ విసిరిన అని హరీశ్ రావు గొప్పలు చెప్పుకుంటున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. మెదక్ పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని అన్నారు. కనీసం డిపాజిట్లైనా తెచ్చుకోండని సూచించారు. దళితులకు మూడెకరాల పేరుతో కేసీఆర్ మోసం చేశారని అన్నారు. ఇక ఉపాధి హామీ కూలీలకు కనీసం 100 రోజులు కూడా ఉపాధి కల్పించలేదని మంత్రి మండిపడ్డారు.


Also Read: స్వతంత్ర అభ్యర్థిగానే నామినేషన్.. కేఏపాల్ పార్టీతో సంబంధం లేదన్న బాబూమోహన్

అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కనీసం ఫామ్ హౌజ్ దాటి రాలేదని.. ఇప్పుడు కర్ర పట్టుకుని బయటకు వస్తున్నారని అన్నారు. ఎట్టిపరిస్థితుల్లో ఆగస్టు 15లోపు రుణమాఫీ చేసి తీరుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. 20 ఏళ్ల కిందనే 76 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని తెలిపారు. జూన్ 4 తర్వాత బీఆర్ఎస్ దుకాణం బంద్ అవుతుందని ముందే తెలిసి ఏం చేయాలో తెలియక కొత్త నాటకాలకు తెర తీశారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు.

Related News

Hyderabad: నాచారంలో దారుణం.. చట్నీ మీద పడేశాడని వ్యక్తి దారుణ హత్య

Heavy Rain Alert: రెయిన్ అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో పిడుగులతో కూడిన వర్షం.. బయటకు వచ్చారో ముంచేస్తుంది..

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్.. దిగేసిన పందెం రాయుళ్లు, గెలుపు-మెజార్టీ-సెకండ్ ప్లేస్‌పై ఫోకస్

Jubileehills Bypoll: జూబ్లీహిల్స్ తెరపైకి జనసేన.. టీడీపీ మౌనం కాంగ్రెస్ కి లాభమేనా?

Karthika Pournami: నేడు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్న దేవాలయాలు

Say No to Drug: ‘సే నో టు డ్రగ్స్’ పేరుతో రాష్ట్రంలో క్రికెట్ టోర్నమెంట్.. ప్రైజ్ మనీ అక్షరాల రూ.80 లక్షలు

Kalvakuntla Kavitha: కవిత టార్గెట్.. కారు పార్టీ.. టచ్‌లో ఆ నేతలు?

Jubilee Hills: ఢిల్లీ నుంచి గల్లీ వరకు కాంగ్రెస్ మాత్రమే లౌకిక పార్టీ: ఉత్తమ్ కుమార్ రెడ్డి

Big Stories

×